Rashmika mandanna : రష్మిక మందన్న ప్రస్తుతం లాక్ డౌన్ సమయంలో ఇంట్లోనే ఖాళీగా ఉంటోంది. ఖాళీ అంటే ఖాళీ ఏమీ కాదు. ఓ ట్యూటర్‌ను పెట్టుకుంది. భాష మీద పట్టు సాధించే పనిలో తలమునకలై ఉంది. ప్రస్తుతం ఈమె తెలుగులో పాన్ ఇండియన్ సినిమా పుష్పలో హీరోయిన్‌గా నటిస్తోంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఇందులో విలేజ్ గర్ల్ పాత్రలో రష్మిమ సందడి చేయబోతోంది. ముత్యం శెట్టి మీడియాతో కలిసి మైత్రీ వారు భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.

rashmika-mandanna is learning hindi language
rashmika-mandanna is learning hindi language

రెండు భాగాలుగా రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. 5 భాషల్లో ఒకేసారి ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్న మేకర్స్ ఆర్ఆర్ఆర్ గనక పోస్ట్ పోన్ అయితే ఆ డేట్‌ను పుష్ప కోసం లాక్ చేసుకోవాలని ప్లాన్ వేస్తున్నారు. ఈ సినిమాతో రష్మికకు ఒకేసారి 5 భాషల్లో క్రేజ్ ఊహించని స్థాయిలో పెరుగుతుందని నమ్మకంగా ఉంది. కాగా బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్న ఈ కన్నడ బ్యూటీ అందుకు రెడీ అవుతూ హిందీ భాష నేర్చుకుంటోందట.

Rashmika mandanna : రష్మిక మందన్న అక్కడ క్రేజ్ కోసం అన్నీ రకాల ప్రయత్నాలు చేస్తోంది.

అమ్మడికి హిందీ భాష మీద పట్టులేకపోతే అక్కడ సినిమా చేయడం కాస్త కష్టమవుతుందనే కారణంగా ప్రత్యేకంగా ఓ ట్యూటర్‌ను పెట్టుకొని బాగా సాధన చేస్తుందని సమాచారం. ప్రస్తుతం హిందీలో మిషన్ మజ్ఞు, గుడ్ బై, అలాగే రీసెంట్‌గా మరో సినిమాను కమిటయింది. ఈ సినిమాలు సూపర్‌ హిట్ అయితే బాలీవుడ్‌లో సెటిలయినట్టే. అందుకే అక్కడ క్రేజ్ కోసం అన్నీ రకాల ప్రయత్నాలు చేస్తోంది. కోలీవుడ్‌లో కూడా సుల్తాన్ సినిమాతో ఎంట్రీ ఇచ్చి అక్కడ కూడా బాగానే పేరు తెచ్చుకుంది.

Stay on top of the game with the latest updates on Telugu latest news today! Experience the thrill of LIVE Telugu news updates like never before, only on Teluguonlinenews.com.

Mail

Published on మే 19, 2021 at 9:01 ఉద.