Samantha – Rashmika Mandanna: సమంత అనుకుంటున్నారు..ఈ విషయంలో రష్మిక మందన్న టాప్ అని ఇప్పుడే తెలిసింది..

G K

Samantha – Rashmika Mandanna: సౌత్ సినిమా ఇండస్ట్రీతో పాటు బాలీవుడ్‌లోనూ విపరీతమైన క్రేజ్ ఉన్న హీరోయిన్ సాలీడ్ ప్రాజెక్ట్స్‌కు సైన్ చేస్తున్న హీరోయిన్ సమంత అని..ఎలాంటి ఛాలెంజింగ్ రోల్ చేసేందుకైనా ఆమె ఇప్పుడు రష్మిక మందన్న, పూజా హెగ్డే, కియారా అద్వాని, కీర్తి సురేశ్ లాంటి వారికంటే ముందు ఉందని అందరూ భావిస్తున్నారు. అంతేకాదు, ఇప్పుడు సమంత చక చకా గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నంతగా వీరిలో ఏ హీరోయిన్ ఇవ్వడం లేదని చెప్పుకున్నారు. కానీ, అది పూర్తిగా తప్పని తాజాగా రష్మిక మందన్న కన్‌ఫర్మ్ చేసింది. సమంత గత ఏడాది కమిటయిన సినిమాలు యశోద, మరో ద్విభాషా చిత్రం.

అలాగే, హాలీవుడ్ సినిమా ది అరేంజ్‌మెంట్స్ ఆఫ్ లవ్. ఇవి మాత్రమే సమంత అధికారికంగా ప్రకటించిన సినిమాలు. ఇక మరికొన్ని హిందీ సినిమాలు, బాలీవుడ్‌ లో కమిటయిందని వార్తలు వస్తున్నాయి గానీ, కన్‌ఫర్మేషన్ మాత్రం లేదు. శాకుంతలం, కణ్మణి రాంబో ఖతీజా చిత్రాలు రిలీజ్‌కు రెడీగా ఉన్నాయి. అంటే అఫీషియల్‌గా సమంత నుంచి వచ్చే సినిమాలు 5. కానీ, సమంతతో పోల్చుకుంటే రష్మిక మందన్న ఎక్కువ సినిమాలు చేస్తోంది. ఇప్పుడు సౌత్ స్టార్ హీరోయిన్స్‌లో ఇంత క్రేజ్ ఉంది అంటే అది రష్మిక మందన్న ఒక్కదానికే అని తాజాగా ఆమె కొత్త ప్రాజెక్ట్స్ ప్రకటనతో క్లారిటీ వచ్చేసింది.

 Rashmika Mandanna is top than samantha
Rashmika Mandanna is top than samantha

Samantha – Rashmika Mandanna: రష్మిక చేతిలో ఎక్కువ ప్రాజెక్ట్స్ ఉన్నాయి.

సుకుమార్ – అల్లు అర్జున్ కాంబినేషన్‌లో మొదలవబోతున్న పాన్ ఇండియన్ సినిమా పుష్ప 2లో రష్మిక నటిస్తోంది. అలాగే, ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ టాలెంటెడ్ డైరెక్టర్ హను రాఘవపూడి తెరకెక్కిస్తున్న సినిమాలో రష్మిక నటిస్తున్నట్టు తాజాగా ప్రకటించారు. నేడు రష్మిక మందన్న బర్త్ డే. ఈ సందర్భం గా ఈ కొత్త ప్రాజెక్ట్‌ను కన్‌ఫర్మ్ చేసింది చిత్రబృందం. దీనిలో ఆమె ముస్లిం యువతిగా నటిస్తోంది. అలాగే, మరో అగ్ర నిర్మాత దిల్ రాజు నిర్మాణంలో కోలీవుడ్ స్టార్ విజయ్ హీరోగా వంశీ పైడిపల్లి రూపొందించబోతున్న సినిమాలో కూడా హీరోయిన్ రష్మిక మందన్న అని కన్‌ఫర్మ్ చేశారు. ఇక బాలీవుడ్‌లో రెండు సినిమాలు రిలీజ్ కాబోతుండగా మూడు సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి. ఈ రకంగా చూస్తే రష్మిక చేతిలో ఎక్కువ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. కాబట్టి ఈ విషయంలో సమంత కంటే రష్మికనే ఓ అడుగు ముందుంది.

- Advertisement -