Rashmika Mandanna: కన్నడ బ్యూటీ రష్మిక మందన్న రౌడీ హీరో విజయ్ దేవరకొండ కోసం ఐటెం సాంగ్ ఒప్పుకుంటుందా..?ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇదే టాక్ వినిపిస్తోంది. అర్జున్ రెడ్డి లాంటి పర్వటెడ్ క్యారెక్టర్ చేసి అసాధారణమైన క్రేజ్ తెచ్చుకున్న విజయ్ ..గీత గోందంలాంటి డీసెంట్ రోల్ చేసి మెప్పించాడు. ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించింది రష్మిక మందన్న. ఛలో సినిమాతో ఎంట్రీ ఇచ్చి హిట్ అందుకున్న ఈకన్నడ భామ..ఆ తర్వాత క్రేజీ హీరోయిన్‌గా మారింది గీత గీవిందం సినిమాతోనే.
ఈ సినిమా తర్వాత విజయ్ దేవరకొండ, రష్మీ కలిసి డియర్ కామ్రేడ్ సినిమా చేశారు. ఈ రెండు సినిమాలలో వీరి లిప్ కిస్ సీన్స్‌కు ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేశారు. అప్పటి నుంచి మళ్ళీ వీరి కాంబో ఎప్పుడు రిపీట్ అవుతుందో అని ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అయితే, తాజా సమాచారం మేరకు విజయ్ దేవరకొండ, రష్మిక కలిసి సినిమా చేయకపోయినా కూడా..పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ నటిస్తున్న జనగణమన సినిమాలో ఓ ఐటెం సాంగ్ మాత్రం చేయడానికి ఒప్పుకున్నట్టు సమాచారం.

Rashmika Mandanna: విజయ్ కోరిక మేరకు రష్మిక ఐటెం సాంగ్ చేసేందుకు సై..?
పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్న జనగనణమ చిత్రీకరణ ప్రస్తుతం శరవేగంగా సాగుతుంది. వంశీపైడిపల్లి – పూరి జగన్నాథ్ – ఛార్మీ కలిసి ఈసినిమాను నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో వచ్చే ఏడాది ఆగస్టు 3న రిలీజ్ చేయనున్నట్టు ఇప్పటికే ప్రకటించారు. ఈ సినిమాలో విజయ్ కోరిక మేరకు రష్మిక ఐటెం సాంగ్ చేసేందుకు సై అనిందట. ఇప్పటివరకు స్టార్ హీరోయిన్స్ కాజల్, పూజా హెగ్డే, శృతి హాసన్, తమన్నా ఐటెం సాంగ్స్ చేసి మెప్పించారు. ఒకవేళ జేజీఎంలో గనక రష్మిక ఐటెం సాంగ్ ఒప్పుకుంటే ఆమెకిదే ఫస్ట్ సాంగ్ అవుతుంది.