Rashmika Mandanna: అర్జున్ రెడ్డి దర్శకుడితో రొమాంటిక్ సీన్స్‌కు ఎస్ చెప్పిన రష్మిక…!

G K

Rashmika Mandanna: అర్జున్ రెడ్డి సినిమా తెలుగులో ఎంతటి సంచలనం సృష్ఠించిందో అందరికీ తెలిసిందే. విజయ్ దేవరకొండకు తిరుగులేని ఇమేజ్‌ను తీసుకువచ్చింది. శాలినీ పాండేతో విజయ్ రొమాంటిక్ సీన్స్ యూత్‌ను మళ్ళీ మళ్ళీ థియేటర్స్‌కు రప్పించేలా చేశాయి. మంచి కంటెంట్‌తో పాటు యూత్ ఆడియన్స్‌ను టార్గెట్ చేసిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా..ఫ్యామిలీ ఆడియన్స్‌ను దృష్ఠిలో పెట్టుకొని మంచి ఎమోషన్స్ కూడా చూపించాడు. అందుకే, అర్జున్ రెడ్డి సినిమాలో బోల్డ్ సీన్స్ బార్డర్ దాటినా అన్నీ వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది.

అంతగా తన స్క్రీన్ ప్లేతో ఆకట్టుకున్నాడు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా. ఇక ఈ సినిమానే హిందీలో కూడా రీమేక్ చేశాడు. బాలీవుడ్‌లో బోల్డ్ పాత్రల్లో హీరో – హీరోయిన్స్ నటించడం కొత్తేమీ కాదు. కానీ, కబీర్ సింగ్ సినిమాలో మాత్రం షాహిద్ కపూర్, కియారాల రొమాన్స్‌ను బాగా ఎంజాయ్ చేశారు. ఈ సినిమా తర్వాత దర్శకుడితో పాటు హీరో, హీరోయిన్‌కు సాలీడ్ క్రేజ్ వచ్చింది. దాంతో సందీప్ రెడ్డి మీద బాలీవుడ్‌లో మంచి క్రేజ్ ఏర్పడింది. ప్రస్తుతం ఆయన తెలుగులో పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్‌తో స్పిరిట్ అనే సినిమాను తెరకెక్కించనున్నాడు.

rashmika-mandanna-says yes to for romantic scenes
rashmika-mandanna-says yes to for romantic scenes

Rashmika Mandanna: ఇలాంటి సీన్స్‌లో చేసేందుకు రష్మిక చాలా ఇంట్రెస్ట్‌గా ఒప్పుకుందట.

హిందీలో రణ్‌బీర్ కపూర్ హీరోగా యానిమల్ సినిమాను రూపొందిస్తున్నాడు. ఈ సినిమాలో ముందు హీరోయిన్‌గా పరిణితి చోప్రాను తీసుకున్నారు. కానీ, ఆమె కమిటయిన ప్రాజెక్ట్స్ కరోనా కారణంగా డిలే అవడంతో యానిమల్ సినిమాకు క్లాష్ అయి తప్పుకుందట. ఇప్పుడు ఆ స్థానంలో రష్మికను తీసుకున్నారట. అయితే, ఈ సినిమాలో బార్డర్‌ను దాటి మరీ రొమాంటిక్ సీన్స్ ఉంటాయట. అర్జున్ రెడ్డి సినిమాతో పోల్చి చూస్తే డబుల్ డోస్‌లో ఉంటాయని తెలుస్తోంది. అలాంటి సీన్స్ చేస్తే బాలీవుడ్‌లో వచ్చే క్రేజ్ భారీ స్థాయిలో ఉంటుంది. అందుకే, ఇలాంటి సీన్స్‌లో చేసేందుకు రష్మిక చాలా ఇంట్రెస్ట్‌గా ఒప్పుకుందట.

- Advertisement -