IPL: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2023 రేపటి నుండి ప్రారంభం కానుంది. మొదటి మ్యాచ్ డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్ మరియు నాలుగుసార్లు విజేత చెన్నై సూపర్ కింగ్స్ మధ్య టోర్నమెంట్ ఓపెనర్‌కు ముందు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరగనుంది. ఐపీఎల్ స్టార్టింగ్ ఈవెంట్ ను నిర్వాహకులు చాలా పెద్దఎత్తున ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది. స్టార్టింగ్ ఈవెంట్ లో నటి రష్మిక మందన్న డాన్స్ పెర్ఫార్మన్స్ ఉండనుంది. అలాగే నటి తమన్నా భాటియా మరియు స్టార్ సింగర్ అరిజిత్ సింగ్‌లతో కలిసి ప్రదర్శనలు ఇవ్వనున్నారు. రష్మిక ఇప్పుడు కేవలం తెలుగులోనే కాకుండా పుష్ప మూవీ తరువాత ఇండియా మొత్తం ఫేమస్ అయ్యారు.
రెండు సంవత్సరాల తర్వాత ఐపీఎల్ ఇప్పుడు ఇండియాలోనే జరుగుతుంది. లాస్ట్ టూ ఇయర్ కరోనా వల్ల వేరే దేశాల్లో ఆడాల్సి వచ్చింది. ప్రారంభ వేడుకలో చాలామంది సూపర్ స్టార్‌లు పాల్గొంటారని వార్తలు వస్తున్నాయి. గుజరాత్ టైటాన్స్ 2022లో తమ ఫస్ట్ సీజన్‌లో ఐపిఎల్ టైటిల్‌ను గెలుచుకోవడం ద్వారా అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆ విజయానికి ప్రధానంగా కెప్టెన్ హార్దిక్ పాండ్యా యొక్క ప్రతిభనే కారణం. మొహమ్మద్ షమీ, రషీద్ ఖాన్, డేవిడ్ మిల్లర్ మరియు రాహుల్ తెవాటియాలు కూడా మంచి ప్రతిభ కనపరిచి విజయాన్ని సాధించారు.
మరోవైపు నాలుగుసార్లు ఛాంపియన్‌లైన CSKకి ఇది మరిచిపోలేని సీజన్. రవీంద్ర జడేజా కెప్టెన్‌గా విఫలమయ్యాడు మరియు ఆల్‌రౌండర్ తన స్థానాన్ని మధ్యలోనే వదిలేయడంతో, మరోసారి MS ధోనీ బాధ్యతలు స్వీకరించాడు. IPL 2023 తర్వాత అతను రిటైర్మెంట్ తీసుకుంటాడనే వార్తల మధ్య ధోని మరోసారి ఫ్రాంచైజీకి కెప్టెన్‌గా ఉంటాడు. ధోని కెప్టెన్సీలో చెన్నై మరోసారి విజయం సాదిస్తుందేమో చూడాలి.