Real Incident : బరువు తగ్గేందుకు జిమ్ కి వెళ్లి ఏకంగా ట్రైనర్ తో ఎఫైర్ పెట్టుకున్న తల్లీకూతుళ్లు… చివరికి ఏమైందంటే….

Joythi R

Real Incident ప్రస్తుత కాలంలో కొందరు వివాహేతర సంబంధాల మోజులో పడి వయసుతో సంబంధం లేకుండా ప్రవర్తించడం, అలాగే వావివరుసలు మరచి తల్లికి కూతురికి మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని కూడా పట్టించుకోకుండా ప్రవర్తిస్తున్నారు. ఇటీవలే ఓ మహిళ బరువు తగ్గేందుకు జిమ్ కి వెళ్ళి ఏకంగా జిమ్ ట్రైనర్ తోనే లవ్ ఎఫైర్ పెట్టుకుని చివరికి అతడి చేతుల్లోనే దారుణంగా హత్యకు గురైన ఘటన కర్ణాటక రాష్ట్రంలో వెలుగు చూసింది.

పూర్తి వివరాల్లోకి వెళితే స్థానిక రాష్ట్రంలోని కర్ణాటక పరిసర ప్రాంతంలో నవీన్ అనే యువకుడు తన కుటుంబ సభ్యులతో కలిసి నివాసముంటున్నాడు. అయితే ఇతడు స్థానికంగా ఉన్నటువంటి ఓ జిమ్ ఫిట్నెస్ సెంటర్ లో ట్రైనర్ గా పని చేస్తున్నాడు. ఇటీవలే నవీన్ ట్రైనర్ గా పని చేస్తున్నటువంటి జిమ్ ఫిట్నెస్ సెంటర్ కి బరువు తగ్గేందుకు అర్చన ఓ మహిళ వచ్చి జాయిన్ అయింది. ఈ క్రమంలో నవీన్ తో అర్చన కి పరిచయం ఏర్పడింది. దీంతో ఈ పరిచయం కాస్త అతికొద్ది సమయంలోనే ప్రేమగా మారింది. దాంతో వీరిద్దరూ త్వరలోనే పెళ్లి కూడా చేసుకోవాలని అనుకున్నారు. ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది. కాగా అర్చన కి ఇంతకుముందే ఇద్దరు వ్యక్తులతో పెళ్లిళ్లు అయ్యాయి. కానీ పెళ్లయిన కొంత కాలానికి తన భర్తలతో మనస్పర్ధలు, విభేదాలు రావడంతో విడాకులు తీసుకుంది. దాంతో గత కొద్దికాలంగా అర్చన ఒంటరిగా కాలం గడుపుతోంది. అయితే అప్పటికే అర్చన రియల్ ఎస్టేట్ వ్యాపార రంగంలో మంచి పట్టు సాధించి ఆర్థికంగా బాగానే సెటిల్ అయింది.

అయితే ఇటీవల కాలంలో అప్పుడప్పుడూ నవీన్ జిమ్ వర్కఔట్లు ఎలా చేయాలో నేర్పించేందుకు అర్చన ఇంటికి వచ్చి వెళుతూ వుండేవాడు. ఈ క్రమంలో అర్చన కూతురు యువిక తో నవీన్ కి పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో నవీన్ ఏకంగా యువిక తో కూడా శారీరక సంబంధం పెట్టుకున్నాడు. దీంతో ఒకరికి తెలియకుండా మరొకరితో కొంతకాలం పాటు తల్లీకూతుళ్లను ఇటు శారీరకంగా అటు ఆర్థికంగా బాగానే ఉపయోగించుకున్నాడు. ఈ క్రమంలో ఇద్దరి నుంచి లక్షల రూపాయలు గుంజాడు. దీంతో చివరికి అర్చన కి అసలు విషయం తెలియడంతో తన కూతురు ని వదలిపెట్టాలని నవీన్ కి సూచించింది. కానీ నవీన్ ను మాత్రం వినలేదు. దీంతో అర్చన ఇంట్లో తరచూ ఈ విషయంపై గొడవలు జరిగేవి. దాంతో నవీన్ ఏకంగా అర్చన కూతురు యువిక ని తీసుకొని దూరంగా వెళ్ళిపోయాడు. ఈ క్రమంలో యువిక ఇంట్లో నుంచి వెళ్ళేటపుడు దాదాపుగా లక్షల రూపాయల నగదు తీసుకుని వెళ్ళింది.

దీంతో అర్చన పోలీసులకు ఫిర్యాదు చేసి నవీన్ చెర నుంచి తన కూతురిని కాపాడాలని కోరింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు నవీన్ మరియు యువిక ను పోలీస్ స్టేషన్ కి పిలిపించి సర్ది చెప్పి పంపించారు. దీంతో అర్చన ఆస్తి పై కన్నేసిన నవీన్ ఆమెను హతమారిస్తే తన ఆస్తి మొత్తం తనకే దక్కుతుందని పన్నాగం పన్నాడు. ఈ పన్నాగం లో భాగంగా తన స్నేహితుల సహాయంతో అర్చన ని దారుణంగా హతమార్చాడు. దాంతో అర్చన కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ చేపట్టారు. ఈ క్రమంలో నవీన్ ని అదుపులోకి తీసుకొని విచారించగా అసలు నిజం బయట పడింది. దీంతో పోలీసులు నవీన్ మరియు అతడితో పాటు నేరానికి సహకరించిన అతడి స్నేహితులను అరెస్ట్ చేసి తీసుకుని కటకటాల్లోకి నెట్టారు.

- Advertisement -