Real Incident : వామ్మో… లవర్ అంటే ఇలా ఉండాలి… కానీ పోలీసులకి చిక్కకూడదు…

Joythi R

Real Incident ఈమధ్య కాలంలో కొందరు సులువుగా డబ్బు సంపాదించాలనే ఆలోచిస్తూ అనవసరంగా లేనిపోని ఇబ్బందులు కొని తెచ్చుకుంటున్నారు. అంతేకాకుండా ఇప్పుడు ఉన్నటువంటి యువతకి కష్టపడే తత్వం చాలా తక్కువగా ఉందని కొన్ని ఇన్సిడెంట్లని బట్టి చూస్తే ఇట్టే అర్థమవుతుంది. అయితే తాజాగా ఓ యువకుడు యువతి కలిసి అడ్డదారుల్లో డబ్బు సంపాదించడం కోసం దొంగతనాలు చేస్తూ పోలీసులకు చిక్కిన ఘటన తమిళనాడు రాష్ట్రంలో వెలుగు చూసింది.

పూర్తి వివరాలకు వెళ్తే స్థానిక రాష్ట్రంలోనే తంగవేలు పరిసర ప్రాంతంలో 28 సంవత్సరాల కలిగిన ఓ యువకుడు తన కుటుంబ సభ్యులతో కలిసి నివాసం ఉంటున్నాడు. అయితే ఈ యువకుడి తల్లిదండ్రులు పలు రకాల వ్యాపారాలు చేసి డబ్బు బాగానే సంపాదించారు. దీంతో తమ కొడుకు కూడా కష్టపడే తత్వం అలవాటు చేయాలని ప్రయత్నించినప్పటికీ ఈ యువకుడు మాత్రం అడ్డదారుల్లో డబ్బు సంపాదించడానికి మరియు సులువుగా డబ్బు సంపాదించడానికి అలవాటు పడ్డాడు. ఈ క్రమంలో తమ తల్లిదండ్రులు ఇచ్చిన పాకెట్ మనీ తో ఐపీఎల్ సీజన్ కావడంతో బెట్టింగులు బాగా ఆడాడు. అయితే మొదట్లో బాగా నే డబ్బు సంపాదించాడు. కానీ క్రమక్రమంగా దురాశకు పోయి ఎక్కువ మొత్తంలో బెట్టింగులపై పెట్టాడు.

ఇంకేముంది ఒక్కసారిగా సీన్ రివర్స్ అయ్యింది. అలాగే తాను బెట్టింగులపై సంపాదించిన డబ్బు మరియు తన దగ్గర ఉన్న డబ్బులు మొత్తం ఖాళీ అయిపోయింది. దీంతో చేసిన అప్పులు తీర్చడానికి అందిన చోటల్లా అప్పులు చేశాడు. అయినప్పటికీ అప్పులు తీరడం లేదు. పాపం యువకుడికి గర్ల్ ఫ్రెండ్ కూడా అంతో ఇంతో సహాయం చేసింది. అయినప్పటికీ అప్పులు మాత్రం తీరలేదు. దీంతో యువకుడు దొంగతనాలు చేయడానికి అలవాటు పడ్డాడు. దీంతో ఈ యువకుడి ప్రియురాలు కూడా అప్పుడప్పుడూ కొన్ని చోట్ల దొంగతనాలు చేసి అప్పులు తీర్చడానికి సహాయం చేసింది. సీన్ కట్ చేస్తే తాజాగా ఇద్దరు పోలీసులకు దొంగతనం చేస్తూ చిక్కారు. దీంతో కొందరు ఈ విషయంపై భిన్నంగా స్పందిస్తున్నారు.

- Advertisement -