Real Story : పెళ్ళాం కాపురానికి రానందని ఏకంగా మరదలిని లైన్ లో పెట్టిన బావ… దాంతో ఇద్దరూ కలిసి…

Joythi R

Real Story : ఒకప్పుడు భార్య, భర్తలు గొడవపడితే తమ కుటుంబ సభ్యులు లేదా ఇరుగుపొరుగు వాళ్ళు నచ్చ చెప్పి మళ్ళీ కాపురానికి పంపించే వాళ్ళు. కానీ ఇప్పుడు మాత్రం భార్య భర్తల మధ్య గొడవలు జరిగాయంటే కుటుంబంలో కలహాలు లేదా విడాకులు తప్పవని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ క్రమంలో కొందరు ఏకంగా వివాహేతర సంబంధాలు పెట్టుకోవడం అలాగే పెళ్లై పిల్లలు ఉన్నటువంటి మహిళలు లేదా పురుషుడు రెండో పెళ్లి చేసుకోవడానికి కూడా వెనుకాడటం లేదు. అయితే తాజాగా ఓ ప్రబుద్ధుడు గొడవపడి పుట్టింటికి వెళ్ళిన తన భార్య కాపురానికి తిరిగి రానని చెప్పడంతో ఏకంగా తన భార్య చెల్లెలిని లైన్ లో పెట్టి లేవదీసుకుని పోయిన ఘటన బీహార్ రాష్ట్రంలో వెలుగుచూసింది.

పూర్తి వివరాల్లోకి వెళితే స్థానిక రాష్ట్రంలోని పాట్నా జిల్లా పరిసర ప్రాంతంలో కృష్ణ రామ్ అనే వ్యక్తి తన కుటుంబ సభ్యులతో కలిసి నివాసముంటున్నాడు. అయితే కృష్ణ రామ్ కుటుంబ పోషణ నిమిత్తమై స్థానికంగా దొరికే చిన్న చిన్న పనులు మరియు కాంట్రాక్టర్ల దగ్గర వంటివి చేసేవాడు. దీంతో అప్పుడప్పుడు మద్యం సేవించి ఇంటికి వచ్చి తన భార్యా పిల్లలతో గొడవ పడేవాడు. ఈ క్రమంలో తాజాగా మరోమారు ఈ భార్యాభర్తలు ఇద్దరి మధ్య గొడవ జరిగింది. దీంతో కృష్ణ రామ్ భార్య సంకటి దేవి అలిగి తన పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో మొదట్లో పిచ్చ లైట్ గా తీసుకున్న కృష్ణారామ్ కొన్ని రోజుల తర్వాత రియలేజ్ అయ్యి తన భార్యను కాపురానికి తీసుకురావాలని సంకటి దేవి ఇంటికి వెళ్ళాడు. కానీ సంకటి దేవి మాత్రం తన భర్త కృష్ణ రామ్ తో కాపురానికి వచ్చేది లేదని కొంతమేర బెట్టు చేసింది.

దీంతో సంకటి దేవి ని బతిమలాడి విసిగిపోయిన కృష్ణ రామ్ ఏకంగా ఆమె చెల్లెలు ని ప్రేమలోకి దించాడు. అంతటితో ఆగకుండా ఇంట్లో నుంచి పారిపోయి వీరిద్దరూ పెళ్లి కూడా చేసుకున్నారు. దీంతో బాలిక తల్లిదండ్రులు దగ్గరలో ఉన్నటువంటి పోలీసులను సంప్రదించి పై కిడ్నాప్ కేసు నమోదు చేశారు. అలాగే అభం శుభం తెలియని మైనర్ బాలికను పెళ్లి చేసుకున్నందుకు తమకు నష్టపరిహారం చెల్లించాలని మరియు కృష్ణ రామ్ ని కఠినంగా శిక్షించాలని బాలిక తల్లిదండ్రులు పోలీసులను కోరారు. మరి ఈ వ్యవహరం ఎక్కడికి దారి తీస్తుందో చూడాలి…

- Advertisement -