Regina cassandra: చిరంజీవితో మొదటిసారి అనుభవం థ్రిల్‌గా ఉంది: రెజీనా కసాండ్ర

G K

Regina cassandra: చిరంజీవితో మొదటిసారి అనుభవం థ్రిల్‌గా ఉంది అంటూ యంగ్ హీరోయిన్ రెజీనా కసాండ్ర ఉబ్బి తబ్బిబ్బవుతోంది. ఇప్పటి వరకు ఈ యంగ్ బ్యూటీ యంగ్ హీరోల సరసన హీరోయిన్‌గా నటించి మంచి హిట్స్ అందుకుంది. మెగా మేనల్లుడు సాయి ధరం తేజ్ సరసన రెండు సినిమాలు చేసిన రెజీనా మెగా ఆఫర్స్ బాగా అందుకుంటుందని అందరూ చెప్పుకున్నారు. కానీ ఇంతలోనే ఆమెకు ఫ్లాపులు మొదలయ్యాయి. దాంతో తెలుగులో కాస్త గ్యాప్ వచ్చింది. ఆ మధ్య అడవి శేష్ హీరోగా నటించిన ఎవరు సినిమాలో ప్రధాన పాత్ర పోషించింది.

ఈ సినిమాతో మంచి హిట్ అందుకున్నప్పటికీ మళ్ళీ యంగ్ హీరోలతో రొమాన్స్ చేసే అవకాశం అందుకోలేదు. అయితే ఊహించని విధంగా మెగాస్టార్ చిరంజీవి నటించిన ఆచార్య సినిమాలో అదిరిపోయే ఐటెం సాంగ్‌లో మాస్ స్టెప్పులేసే ఛాన్స్ అందుకుంది. మెగాస్టార్ పక్కన సాంగ్‌లో చేసే అవకాశం అంటే ఇక ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఒక్క సాంగ్‌తో విపరీతమైన క్రేజ్ వచ్చేస్తుంది. అలాంటి క్రేజ్ ఇప్పుడు రెజీనాకి ఆచార్య సినిమాలో ఉన్న ‘శానా కష్టం’ సాంగ్‌తో వచ్చింది.

regina-cassandra-feels excited to work with chiranjeevi
regina-cassandra-feels excited to work with chiranjeevi

Regina cassandra: ఎందుకు ఆయనను మెగాస్టార్ అంటారో సెట్‌లో ఉన్న వారికి మాత్రమే తెలుస్తుంది.

జస్ట్ లిరికల్ సాంగ్‌తోనే అందరి దృష్ఠిని ఆకట్టుకుంది రెజీనా. మెగా మాస్ స్టెప్పులకు రెజీన్నా ఎద అందాలు, నాభి అందాల ప్రదర్శన హైలెట్‌గా నిలిచాయి. ఈ సాంగ్ మెగా అభిమానులనే కాదు అందరినీ విపరీతంగా ఆకట్టుకుంటుంది. అయితే రెజీనా కెరీర్‌లో మొదటిసారి ఐటెం సాంగ్ చేసంది. అది కూడా మెగాస్టార్‌తో. ఈ అనుభవం చాలా థ్రిల్లింగ్‌గా ఉందని తాజాగా రెజీనా చెప్పుకొచ్చింది. ఎందుకు ఆయనను మెగాస్టార్ అంటారో సెట్‌లో ఉన్న వారికి మాత్రమే తెలుస్తుందని ఈ యంగ్ బ్యూటీ ఎగ్జైట్ అవుతూ చెప్పుకొచ్చింది. ఇక ఆచార్య సినిమాతో పాటు నివేతా థామస్‌తో శాకిని డాకిని చిత్రంలో రెజీనా నటిస్తోంది.

- Advertisement -