RGV : నేను గే కానని ఫైర్ అయిన రామ్ గోపాల్ వర్మ…. అందుకేనా…?

Joythi R

RGV టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో డేర్ అండ్ డాషింగ్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా తెలియజేయాల్సిన అవసరం లేదు. అయితే దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఒకప్పుడు వైవిధ్యభరితమైన కథనాలను ఎంచుకుంటూ ప్రేక్షకులని బాగానే అలరించాడు. కానీ ఈ మధ్యకాలంలో ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోతున్నాడు. దీంతో రామ్ గోపాల్ వర్మ తన చిత్రాలతో కంటే ఎక్కువగా వివాదాలతోనే పాపులర్ అవుతున్నాడని మరి కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కాగా ప్రస్తుతం దర్శకుడు రామ్ గోపాల్ వర్మ డేంజరస్ అనే చిత్రానికి దర్శకత్వం వహించాడు. కాగా ఈ చిత్రంలో తెలుగు హాట్ బ్యూటీ లైన అప్సర రాణి మరియు నైనా గంగూలీ తదితరులు మెయిన్ లీడ్ పాత్రలలో నటించారు. కాగా తాజాగా నటుడు రామ్ గోపాల్ వర్మ ఈ చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా ఓ ప్రముఖ వార్తా చానెల్ నిర్వహించిన ఇంటర్వ్యూలో ఈ ఇద్దరి హాట్ బ్యూటీలతో కలిసి హాజరయ్యాడు.

అయితే ఈ ఇంటర్వ్యూలో భాగంగా కొందరు రామ్ గోపాల్ వర్మ అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చాడు. అయితే ఇందులో ఓ యువతి ఈ మధ్యకాలంలో మీరు ఎక్కువగా అమ్మాయిలతోనే కనిపిస్తున్నారని అబ్బాయిలతో పెద్దగా కనిపించడం లేదని అడిగింది. అలాగే మీకు అబ్బాయిలలో ఫ్రెండ్స్ లేరా…? అని కూడా అడిగింది. దీంతో రామ్ గోపాల్ వర్మ ఏకంగా తనదైన శైలిలో స్పందిస్తూ తాను గే ను కాదని అలాగే తనకి అబ్బాయిలు అంటే పెద్దగా ఇష్టం ఉండదని అందువల్లనే అమ్మాయిలతో ఎక్కువగా తిరుగుతానని దిమ్మ తిరిగిపోయే ఆన్సర్ ఇచ్చాడు. ఇంకేముంది ఈ ప్రశ్న అడిగిన యువతికి ఒక్కసారిగా మైండ్ బ్లాంక్ అయ్యింది. దీంతో వీరిద్దరి సంభాషణ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అలాగే రామ్ గోపాల్ వర్మ గురించి తెలిసి కూడా ఇలాంటి ప్రశ్న అదిగిందంటే సాహసమనే చెప్పాలి అంటూ ఆ యువతి ని చూసి అయ్యే పాపం…. అంటూ కొందరు కామెంట్లు చేస్తున్నారు.

ఈ విషయం ఇలా ఉండగా డేంజరస్ చిత్రం ఈ నెల 8వ తారీకున ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. దీంతో రామ్ గోపాల్ వర్మ ఈ సినిమా కి సంబందించిన హాట్ పోస్టర్లు, ట్రైలర్లు విడుదల చేస్తూ చాలా బోల్డ్ గా ప్రమోట్ చేస్తున్నాడు. మరి డేంజరస్ చిత్రం ఏ విధంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో చూడాలి.

- Advertisement -