ఆచార్య విడుదల రోజే చిరంజీవి ఇంటికెళ్ళిన మంత్రి రోజా.. ఎందుకో తెలుసా?

Akashavani

తెలుగు రాష్ట్రాల ప్రజలకు మెగాస్టార్ చిరంజీవి గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. దాదాపు 150 సినిమాల్లో పైగా తెలుగులో తనదైన ముద్ర ఏర్పాటు చేసుకున్నాడు. ఇక తన నటన కంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక చిరంజీవి యాక్టింగ్ ఒక ఎత్తయితే.. అతడి బ్రేక్ డాన్స్ మరో లెవల్ అని చెప్పవచ్చు.

మొత్తానికి చిరంజీవి టాలీవుడ్ లో అగ్ర స్టార్ హీరోలతో తాను ఒక్కడుగా ఓ వెలుగు వెలుగుతున్నాడు. ఇక చిరు సినీ ఇండస్ట్రీ లోనే కాకుండా రాజకీయంగా కూడా కొంత ఫాలోయింగ్ పెంచుకున్నాడు. ఇక మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టివ్ గా ఉంటాడు. ఎప్పటికప్పుడు తన అభిమానులకు తన విలువైన అప్ డేట్స్ పంచుకుంటాడు.

ఇదిలా ఉంటే నిన్న అనగా ఏప్రిల్ 29న మెగాస్టార్ చిరంజీవి, తన కొడుకు రామ్ చరణ్ తేజ్ కలిసి నటించిన ఆచార్య సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక తండ్రి కొడుకులు కాంబోలో వచ్చిన సినిమా కావడంతో ప్రేక్షకులు భారీ అంచనాలు వేసుకున్నారు. కాగా దాదాపు సినిమా గురించి పాజిటివ్ టాక్ నడిచింది.

ఇక నిన్న ఆచార్య విడుదల సినిమా రోజు ఇటీవల మంత్రి బాధ్యతలు చేపట్టిన రోజా మెగాస్టార్ చిరంజీవి ఇంటికి వెళ్ళింది. ఇక మెగాస్టార్ చిరంజీవి రోజాకు ఎంతో గౌరవంగా వెల్కమ్ చెప్పారు. ఇక ఆచార్య సినిమా విడుదల సందర్భంగా రోజా చిరంజీవి కి ఒక బుకే ను అందజేసింది.

మంత్రి రోజా కు చిరంజీవి ఈ విధంగా సన్మానం చేసాడు!

మెగాస్టార్ చిరంజీవి కూడా రోజా కు ఒక శాలువా కప్పి ఎంతో గౌరవంగా సన్మానం చేసినట్టు తెలుస్తుంది. అనంతరం రోజా మెగాస్టార్ భార్య, తన ఫ్యామిలీ అందరిని పలకరించినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక మీరు కూడా వీడియో వైపు ఒక లుక్ వెయ్యండి.

- Advertisement -