NTR : యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం భారీ మల్టీ స్టారర్‌గా తెరకెక్కుతున్న ఆర్ఆర్ఆర్ సినిమాలో కొమురం భీంగా నటిస్తున్న సంగతి తెలిసిందే. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరొక హీరోగా నటిస్తున్నాడు. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజుగా చరణ్, కొమురం భీమ్ గా తారక్ పాత్రలు ఎంతో శక్తివంతంగా ఉంటాయని చెప్పుకుంటున్నారు. ఇప్పటికే భారీ స్థాయిలో ఆర్ఆర్ఆర్ బిజినెస్ కూడా జరగడం విశేషం. అయితే ఈ సినిమాలో కొమురం పాత్ర కోసం తారక్ 18 నెలలు ట్రైనింగ్ తీసుకున్నాడట. ఇప్పటి వరకు 19 నెలలు షూటింగ్ చేసినట్టు తెలిపాడు.

rrr-ntr-31-movie-secrets-revealed-by-young-tiger
rrr-ntr-31-movie-secrets-revealed-by-young-tiger

ఇక తన 30వ సినిమాను కొరటాల శివ దర్శకత్వంలో చేయబోతున్నాడు. ఇటీవలే ఈ సినిమా ప్రకటన కూడా వచ్చింది. ఎన్టీఆర్ ఆర్ట్స్ – యువసుధ ఆర్ట్స్ బ్యానర్లపై ఈ సినిమా పాన్ ఇండియన్ స్థాయిలో తెరకెక్కనుంది. ఆర్ఆర్ఆర్ తర్వాత వెంటనే ఈ సినిమా సెట్స్ మీదకు రానుంది. వచ్చే ఏడాది రిలీజ్ అయ్యే అవకాశాలున్నాయి. కాగా ఎన్టీఆర్ 31 గురించి గత కొన్ని రోజులుగా ఆసక్తికరమైన చర్చలు సాగుతున్నాయి. ఈ సినిమాకి దర్శకుడెవరు.. నిర్మాణ సంస్థ ఏది అని సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి.

NTR : ఎన్టీఆర్ 31 ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో చేయబోతున్నట్టు వెల్లడించాడు.

ఎన్టీఆర్ తన 31న సినిమాను కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో చేయబోతున్నట్టు వెల్లడించాడు. మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మించబోతున్నారు. ఇది వరకే మైత్రీ వారు ఈ విషయాన్ని వెల్లడించగా తాజాగా తారక్ నుంచి కూడా కన్‌ఫర్మేషన్ వచ్చింది. ఇక పరిస్థితులన్నీ సద్దుమణిగాక ఎన్టీఆర్ 31 – ప్రశాంత్ నీల్ – మైత్రీ మూవీ మేకర్స్ నుంచి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రానుందట. ప్రస్తుతం ఎన్టీఆర్ కరోనా బారిన పడి హోం ఐసోలేషన్‌లో ఉన్నాడు.

Stay on top of the game with the latest updates on Telugu latest news today! Experience the thrill of LIVE Telugu news updates like never before, only on Teluguonlinenews.com.

Mail

Published on మే 12, 2021 at 8:15 సా.