RRR Success భారీ అంచనాల మధ్య విడుదలై..ఆ అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా కలెక్షన్ల సునామి సృష్టిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా మార్చి 25న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం బాక్సాపీస్ ను షేక్ చేస్తూ..తన స్టామినా ఏంటో చూపిస్తోంది. ఆర్ఆర్ఆర్ ఇండియావైడ్ గా విడుదలైన అన్ని థియేటర్లోల సక్సెస్ ఫుల్ టాక్,కలెక్షన్లతో దూసుకెళ్తోంది. గ్లోబల్ బాక్సాపీస్ వద్ద హాలీవుడ్ సినిమాలను సైతం బీట్ చేస్తుందంటే ఆర్ఆర్ఆర్ దూసుడు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇదిలాఉంటే ఈ సినిమా నైజాం ఏరియా డిస్ట్రిబ్యూషన్ హక్కులను ప్రముఖ నిర్మాత దిల్ రాజు సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.
ఈ సినిమా ఊహించిన దానికంటే ఎక్కువ వసూళ్లను నైజాంలో రాబట్టి దిల్ రాజుకు కాసుల పంట పండిస్తోంది. ఈ నేపథ్యంలో దిల్ రాజ్ సక్సెస్ పార్టీని ఏర్పాటు చేశాడు. హైదరాబాద్‌లోని ఎన్ కన్వెన్షన్ లో ఆర్ఆర్ఆర్ టీంకుసక్సెస్ పార్టీ ఇచ్చాడు దిల్ రాజు. ఈ పార్టీకి లీడ్ యాక్టర్స్ రాంచరణ్, ఎన్టీఆర్‌తో పాటు వారి కుటుంబసభ్యులు, ఇతర యాక్టర్లు, డైరెక్టర్ రాజమౌళి దంపతులు, కీరవాణి, నిర్మాత డీవీవీ దానయ్యతోపాటు ఆర్ఆర్ఆర్ టీం మెంబర్స్ హాజయ్యారు.

ఆర్ఆర్ఆర్ 9 రోజులు ముగిసేసరికి ఇప్పటివరకు రూ.830 కోట్టు గ్లోబల్బాక్సాపీస్ వద్ద కలెక్షన్లను రాబట్టింది. త్వరలోనే 900 కోట్ల క్లబ్‌లోకి అడుగుపెట్టనుంది. ఇక నైజాం ఏరియా విషయానికొస్తే 10 రోజు ముగిసేనాటికి ఆర్ఆర్ఆర్ 100 క్లబ్‌లోకి ఎంటరవడం ఖాయమని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో సినీ ప్రముఖులకు దిల్ రాజు ఏర్పాటు చేసిన పార్టీ ఇపుడు టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. ఈ చిత్రంలో రాంచరణ్, ఎన్టీఆర్ నటనకు ప్రేక్షకులు ఫిదా అయిపోతున్నారు. తారక్ యాక్టింగ్ గూస్ బంప్స్ తెప్పించేలా ఉండటంతో..ఆర్ఆర్ఆర్ క్రేజీ రోజురోజుకీ పెరిగిపోతుంది.
Tollywood celebrities at @RRRMovie Success party held at N Convention in Hyderabad last night
Vc: @ArtistryBuzz #BlockBusterRRR #RRRMovie #RRRSuccessBash #RRRMovieCelebrations #RRRSuccessParty pic.twitter.com/3VahT9y2yF
— Uppalapati Sai KaRRRthik (@karthiksai9999) April 5, 2022