Saipallavi: పి వాసు దర్శకత్వంలో రజినీకాంత్, నయనతార జ్యోతిక వంటి తదితరులు నటించిన చిత్రం చంద్రముఖి ఈ సినిమా అప్పట్లో ఎలాంటి సంచలనాలను సృష్టించిందో మనకు తెలిసిందే. ఇలా ఈ సినిమా అద్భుతమైన ఆదరణ పొందడమే కాకుండా ఎంతోమంది ప్రేక్షకులను భయభ్రాంతులకు కూడా గురి చేసిందని చెప్పాలి. ఇకపోతే ఈ సినిమాకి సీక్వెల్ చిత్రాన్ని కూడా ప్రకటించిన సంగతి మనకు తెలిసిందే. వాసు దర్శకత్వంలో రజనీకాంత్ కు బదులుగా లారెన్స్ ఈ సినిమాలో నటించారు. ఇక ఇందులో చంద్రముఖి పాత్రలో జ్యోతికకు బదులు కంగనా నటించారు.
ఎన్నో అంచనాల నడుమ ఈ సినిమా సెప్టెంబర్ 19వ తేదీ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది. తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్ విడుదల చేయగా ఈ ట్రైలర్ సినిమాపై భారీ అంచనాలను పెంచేస్తుంది. ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. చంద్రముఖి పాత్రలో ఈ సినిమాలో నటించడానికి కంగనా కన్నా ముందుగా నటి సాయి పల్లవి అయితే బాగుంటుందని చిత్ర బృందం భావించారట.
ఆ కారణంతోనే రిజెక్ట్ చేశారు..
చంద్రముఖి పాత్రలో నటించడం కోసం సాయి పల్లవి కళ్ళు అద్భుతంగా ఉంటాయని అలాగే ఈమె డాన్స్ కూడా ఎంతో అద్భుతంగా చేస్తారన్న ఉద్దేశంతో ఈ పాత్రకు సాయి పల్లవి అయితే బాగుంటుందని చిత్ర బృందం మొదట సాయి పల్లవిని ఎంపిక చేసి ఈ విషయం గురించి తనని సంప్రదించగా ఈమె మాత్రం ఈ సినిమాకు సున్నితంగా నో చెప్పారని తెలుస్తోంది. ఈ విధంగా సాయి పల్లవి ఈ సినిమాకు నో చెప్పడానికి మరే కారణం లేదు ఈమె సీక్వెల్ సినిమాలను అలాగే రీమేక్ సినిమాలను చేయరు అనే సంగతి మనకు తెలిసిందే ఇలాంటి సినిమాలు అన్నింటికి సాయి పల్లవి దూరంగా ఉంటారు. అందుకే ఈ సినిమాని కూడా రిజెక్ట్ చేశారని తెలుస్తుంది. అయితే ఈ విషయం తెలిసినటువంటి అభిమానులు ఈ సినిమాలో సాయి పల్లవి కనుక నటించి ఉంటే మరో లెవల్లో ఉండేది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.