Saipallavi: లేడీ పవర్ స్టార్, నేచురల్ స్టార్ సాయి పల్లవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె ఇండస్ట్రీలోకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే ఎంతో మంచి క్రేజ్ సొంతం చేసుకున్నారు. అయితే నటిగా ఇండస్ట్రీలో ఎంతో మంచి ఆదరణ సంపాదించుకున్నటువంటి సాయి పల్లవి సినిమాలలో నటించాలి అంటే కేవలం తన పాత్రకు ప్రాధాన్యత ఉండాలి అలాగే సినిమాలలో ఎలాంటి రొమాంటిక్ సన్ని వేషాలు ఉండకూడదు ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని ఈమె సినిమా కథలను ఎంపిక చేసుకుంటారు.
ఇలా తనకు కథ నచ్చకపోయినా సినిమాలలో రొమాంటిక్ సన్నివేశాలు ఉన్న నిర్మొహమాటంగా అవతల స్టార్ హీరో అయిన స్టార్ డైరెక్టర్ అయిన ఆ సినిమాలో నటించనని తేల్చి చెప్పేస్తుంది. ఇలా ఇప్పటికే సాయి పల్లవి ఎన్నో అద్భుతమైన సినిమాలను వదులుకున్నారని తెలుస్తుంది. ఇకపోతే తాజాగా ఈమె ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సినిమాలు కూడా మిస్ చేసుకున్నారంటూ వార్త వైరల్ అవుతుంది. సాయి పల్లవి అల్లు అర్జున్ కాంబినేషన్లో సినిమా చేయాలని ఓ డైరెక్టర్ చాలా ప్రయత్నాలు చేశారట.
రొమాంటిక్ సన్నివేశాలు ఉండటమే కారణమా…
ఈ విధంగా సాయి పల్లవి అల్లు అర్జున్ కాంబినేషన్లో సినిమా చేయాలని డైరెక్టర్ ప్రయత్నాలు చేయగా సాయి పల్లవికి కథ మొత్తం వివరించారు. అయితే కథ అద్భుతంగా ఉన్నప్పటికీ ఈ సినిమాలో కొన్ని రొమాంటిక్ సన్నివేశాలు ఉండడంతో సాయి పల్లవి నిర్మొహమాటంగా తాను ఈ సినిమాలో నటించనని తేల్చి చెప్పేసారట. ఈ విధంగా సాయి పల్లవి ఈ ఒక్క కారణం తోనే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సినిమాలో నటించే అవకాశాన్ని కోల్పోయారని చెప్పాలి. ఇక ఈమెకు పుష్ప సినిమాలో కూడా ముందుగా తనకి అవకాశం వచ్చిందని ఈ సినిమాలో కూడా రొమాంటిక్ సన్నివేశాలు ఉండడం చేతనే తాను నటించనని తేల్చి చెప్పారను కూడా వార్తలు వచ్చిన సంగతి మనకు తెలిసిందే.