Samantha: రానున్న రోజుల్లో సమంత కెరీర్లో భారీ మార్పులు చోటు చేసుకోబోతున్నాయా..? ఇక ఆమె కెరీర్లో సక్సెస్‌లు తగ్గిపోతాయా..! అంటే గత రెండు రోజుల నుంచి ఇదే టాక్ నెటిజన్స్ నుంచి వినిపిస్తోంది. దీనికి కారణం ఇటీవల సమంత బర్త్ డే రోజు వచ్చిన అప్డేట్స్ డిసప్పాయింట్ చేయడమే. సమంత..కెరీర్లో ఎప్పుడూ లేనంతగా చైతూతో విడిపోయాక తనకు నచ్చిన కథలను ఎంపిక చేసుకుంటూ వస్తోంది. కమర్షియల్ యాడ్స్ కూడా ఈ మధ్య కాలంలో సమంత చేసినన్నీ మరే హీరోయిన్ చేయలేదనే చెప్పాలి.
వారానికో కొత్త యాడ్‌లో కనిపించి ఫ్యాన్స్‌కు బాగానే సర్ప్రైజ్ ఇస్తోంది. అయితే, సమంత నటించిన తమిళ మల్టీస్టారర్ మూవీ కాతు వాక్కుల రెండు కాదల్( కణ్మనీ రాంబో ఖతీజా ) సమంత పుట్టినరోజు నాడే థియేటర్స్‌లోకి వచింది. ఒకేసారి ఇటు తెలుగులో డబ్బింగ్ వెర్షన్ అటు తమిళ వెర్షన్ వచ్చి అభిమానులను, ప్రేక్షకులను తీవ్రంగా నిరాశపరిచింది. తెలుగులో ఒక్క సమంత వల్లే సినిమా హిట్ అవుతుందని భావించిన వారూ లేకపోలేదు. కారణం ఇక్కడ సమంత కంటే నయనతార, విజయ్ సేతుపతిలకు క్రేజ్ అంతగా లేకపోవడమే.

Samantha: సమంత స్క్రీన్ మీద ఇలాగే కనిపిస్తే హిట్ అనేది కష్టమే..?
కానీ, సమంత క్రేజ్ అస్సలు పనిచేయలేదు. ఇక గుణశేఖర్ దర్శకత్వంలో సమంత నటించిన పౌరాణిక పాన్ ఇండియన్ సినిమా శాకుంతలం. ఆదిపర్వంలోని శకుంతల – దుష్యంతుల ప్రేమ కథ ఆధారంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అయితే, సమంత బర్త్ డే రోజు శాకుంతలం సినిమా నుంచి సమంత లుక్ రిలీజ్ చేశారు. ఇది చూసిన ప్రతీ ఒక్కరు నెగిటివ్ కామెంట్స్ తప్ప పాజిటివ్‌గా మాట్లాడింది లేదు. వాస్తవంగా ఆ సమయంలో సమంత – నాగ చైతన్యలు విడిపోతున్న దశ. అప్పుడు సమంత ఎంత డిస్ట్రబ్‌గా శాకుంతలం పోస్టర్స్‌లో తెలిసిపోతుంది. ఈ పోస్టర్‌కే నెగిటివ్ కామెంట్స్ వచ్చాయంటే శాకుంతలం సినిమా రిలీజయ్యాక సమంత స్క్రీన్ మీద ఇలాగే కనిపిస్తే హిట్ అనేది కష్టమే అని కామెంట్స్ వినిపించాయి. మరి గుణశేఖర్ ఏదైనా మ్యాజిక్ చేస్తారేమో చూడాలి. ఒకవేళ శాకుంతలం రిజల్ట్ గనక తేడా కొడితే సమంత కాస్త స్లో అవుతుందనడంలో సందేహమే లేదు.