Samantha: నాగ చైతన్య దెబ్బకి ఇన్స్టా పోస్ట్ మార్చేసిన సమంత ..ఏం పెట్టిందంటే..

G K

Samantha: అక్కినేని నాగ చైతన్య, సమంత విడిపోయి ఇన్ని నెలలవుతున్నా ఇంకా నెటిజన్స్ ఫోకస్ మొత్తం వారిద్దరి మీదే ఉంది. సమంత ఎందుకు ఇలాంటి సినిమాలు ఎంచుకుంటోంది..నాగ చైతన్య మీద కోపం వల్లేనా..చైతూ ఎందుకు సమంత కామెంట్స్‌కు అసలు రియాక్ట్ అవడం లేదు..తప్పంతా  చైతూదేనా..అందుకే ఏం మాట్లాడకుండా సైలెంట్‌గా ఉంటున్నాడా..ఇలా ఎవరికి తోచినట్టు వారు వార్తలు రాసేస్తున్నారు. విడాకుల తర్వాత సమంత మాత్రమే ప్రతీరోజూ ఏదో ఒక పోస్ట్ పెట్టి మా అమ్మ చెప్పింది అంటూ దానికి కామెంట్ జత చేసేది. దాంతో కొందరు నెటిజన్స్.. అన్నీ మీ అమ్మ చెప్తేనే చేస్తూ వచ్చావా అంటూ ఆమెను ట్రోల్ చేయడం కూడా తెలిసిందే.

అయితే, నాగ చైతన్య మాత్రం సమంత ఎలాంటి పోస్ట్ పెట్టినా ఏదీ పట్టనట్టుగా ఉన్నాడు. అభిమానులు మాత్రం చైతూ ఏదోకటి క్లారిటీ ఇవ్వాలని పట్టుపట్టారు. ఈ నేపథ్యంలో ఎట్టకేలకి నాగ చైతన్యను సమంతతో విడాకులు గురించి అడిగారు. బంగార్రాజు సినిమా సక్సెస్ మీట్‌లో భాగంగా చైతూని ఈ ప్రశ్న అడగగా పక్కాగా దీనికి సమాధానం ఇవ్వాలని ముందే ప్రిపేర్ అయినట్టు చైతూ సమాధానం వచ్చి అందరినీ షాకయ్యేలా చేసింది. ఇద్దరం హ్యాపీగా ఉండాలనే ఈ డెసిషన్ తీసుకున్నాము. తను అక్కడ హ్యాపీగా ఉంది. నేనిక్కడ హ్యాపీగా ఉన్నాను.

samantha-changed instagram profile
samantha-changed instagram profile

Samantha: సమంతను ఎందుకో హర్ట్ చేసినట్టుంది.

అంటూ చాలా డీసెంట్ ఆన్సర్ ఇచ్చాడు. ఇది సమంతను ఎందుకో హర్ట్ చేసినట్టుంది. నిన్నా, మొన్నటివరకు తన ఇన్స్టాగ్రాం ప్రొఫైల్ క్యాప్షన్‌గా బిలీవ్ అని ఉండేది. కానీ నాగ చైతన్య ఇచ్చిన ఆన్సర్‌కు ఒక నది రాయిని చీల్చుతుంది..అంటే దాని శక్తివల్ల కాదు పట్టుదల వల్ల అంటూ మార్చేసింది. దీనిని బట్టి చూస్తే సమంత మళ్ళీ కొన్నాళ్ళు  సోషల్ మీడియాకు దూరంగా ఉండేలా కనిపిస్తోంది. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న సమంత చైతూ వల్లే ఇలా పోస్ట్ మార్చి కామెంట్ పెట్టి రియాక్ట్ అయిందని చెప్పుకుంటున్నారు. ఏదేమైనా సమంత, నాగ చైతన్యల విడాకుల మ్యాటర్‌ను జనాలు అంత త్వరగా వదిలేరా లేరు.

- Advertisement -