Samantha: సమంత వెనకాల బాలీవుడ్ పడుతుందా..? అంటే ఇప్పుడు వరుసగా వస్తున్న కథనాలు చూస్తుంటే అదే అనిపిస్తుంది. కెరీర్ పరంగా సమంత అస్సలు తగ్గడం లేదు. ఇప్పటికే రెండు సినిమాలను రిలీజ్‌కు రెడీ చేస్తుంది సమంత. ఆ రెండు కూడా పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కాబోతుండటం విశేషం. గుణశేఖర్ దర్శకత్వంలో నటించిన పౌరాణిక చిత్రం శాకుంతలం సినిమా సమంత కెరీర్‌కి చాలా ఇంపార్టెంట్. ఈ సినిమాతో తను సంపాదించుకునే క్రేజ్ పాన్ ఇండియా రేంజ్‌లోనే. ఇక యశోద కూడా అదే స్థాయి చిత్రం. ఈ సినిమా కూడా పాన్ ఇండియా స్థాయిలో 5 భాషలలో రిలీజ్ అవుతోంది.
ఇక బాలీవుడ్‌లో సమంత గట్టిగా జెండా పాతబోతుందని ఇప్పటికే సంకేతాలు అందుతున్నాయి. అక్కడ ఇప్పటికే వరుణ్ ధావన్‌తో రాజ్ అండ్ డీకే దర్శకత్వంలో ఓ వెబ్ సిరీస్, అలాగే కాఫీ విత్ కరణ్ షోలో పాల్గినడం చూస్తే మొత్తానికి సౌత్ నుంచి నార్ వెళ్ళడానికి అమ్మడు గట్టిగానే ప్లాన్ చేసుకుందని క్లియర్‌గా అర్థమవుతుంది. దీనికి ఇటీవలే స్టార్ హీరోయిన్ తాప్సీ కూడా క్లారిటీ ఇచ్చింది. తాప్సీ సొంత నిర్మాణ సంస్థలో సమంత ఓ సినిమా చేస్తున్న విషయాన్ని కన్‌ఫర్మ్ చేసింది. దాంతో అదే సమంత బాలీవుడ్ డెబ్యూ సినిమా అని అనుకున్నారు.
Samantha: అదే ఇప్పుడు అటు బాలీవుడ్‌లో ఇటు టాలీవుడ్‌లో హాట్ టాపిక్
కానీ, తాజాగా వస్తున్న వార్తలను బట్టి చూస్తే సమంత మొదటి సినిమా టాలెంటెడ్ హీరో ఆయుష్మాన్ ఖురానా సరసన అని తెలుస్తోంది. ఆయుష్మాన్ సరసన సమంత హీరోయిన్‌గా సినిమా చేయబోతుందట. అదే ఇప్పుడు అటు బాలీవుడ్‌లో ఇటు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా రన్ అవుతోంది. అంతేకాదు, తాప్సీ సినిమా కంటే కూడా ముందు ఆయుష్మాన్ ఖురానా – సమంత సినిమానే రిలీజ్ అవుతుందని..అందుకే ఇది సమంత బాలీవుడ్డెబ్యూ అని చెప్పుకుంటున్నారు. చూడాలి మరి ఇందులో ఏదీ కన్‌ఫర్మ్ అవుతుందో. ఏదేమైనా సమంత వెనకాల బాలీవుడ్ పడుతుందని తెలుస్తోంది.