Samantha: బాలీవుడ్ సీనియర్ హీరోతో సమంత రొమాన్స్‌కు సై..?

G K

Samantha: సమంత జోరు ఇప్పట్లో తగ్గేలా లేదని ఆమె కమిటవుతున్న ప్రాజెక్ట్స్ చూస్తూనే అర్థమవుతోంది. రానున్న రెండేళ్ళ వరకు డైరీలో డేట్స్ అన్నీ లాక్ చేసేస్తోంది. అయితే, ప్రస్తుతం సమంత, పూజా హెగ్డే, రష్మిక మందన్నల మాదిరిగా కేవల బాలీవుడ్ ఇండస్ట్రీ మీదే ఫోకస్ చేయడం లేదు. అటు కమర్షియల్ యాడ్ ఫిలింస్, కవర్ పేజీల మీద మాగ్జైన్స్‌కు ఫోజులివడం, తెలుగు, తమిళ భాషలలో రూపొందించే సినిమాలను కమిటవుతోంది.

చెప్పాలంటే అవకాశాలు దక్కాలే గానీ, ఏ ఒక్క ఇండస్ట్రీని, ఏ కమర్షియల్  యాడ్‌ ను వదిలేలా లేదు. ఈ మధ్య కమర్షియల్ యాడ్స్ పరంగా మరీ దూకుడు పెంచు తోంది. వారికో యాడ్‌లో కనిపించి సందడి చేస్తోంది. శాకుంతలం, కణ్మణి రాంబో ఖతీజా సినిమాలను రిలీజ్‌కు సిద్దం చేస్తున్న సమంత యశోద సినిమాను పూర్తి చేస్తూ వస్తోంది. అలాగే, వచ్చే నెల నుంచి హాలీవుడ్ సినిమా అరేంజ్‌మెంట్స్ ఆఫ్ లవ్ సినిమాను సెట్స్ మీదకు తీసుకురాబోతోంది. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ఎప్పుడెప్పుడొస్తుందో అని అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

samantha-is going to act with bollywood hero
samantha-is going to act with bollywood hero

Samantha: అక్కి మూవీ ఓకే అయితే సమంత ఖాతాలో భారీ హిట్..

ఎందుకంటే ఈ హాలీవుడ్ సినిమాలో సమంత లెస్బియన్ పాత్రలో నటిస్తుండమే. కాగా, ఇప్పుడు బాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో అక్షయ్ కుమార్‌తో రొమాన్స్ చేసేందుకు రెడీ అవుతుందని తాజా సమాచారం. బాలీవుడ్‌లో భారీ ప్రాజెక్ట్స్ లైనప్ చేసుకుంటోంది. దీనిలో భాగంగానే కుమార్ మంగత్ దర్శకత్వంలోతెరకెక్కబోతు న్న సినిమాలో సమంత అవకాశం అందుకుందట. ఖాన్‌ల త్రయాన్ని వెన్నక్కి నెట్టి అక్షయ్ కుమార్ వరుసగా సినిమాలను చేస్తూ భారీ హిట్స్ అందుకుంటున్నారు. కాబట్టి అక్కి మూవీ ఓకే అయితే సమంత ఖాతాలో భారీ హిట్ పడటం గ్యారెంటీ. మరి ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన అఫీషియల్ అప్‌డేట్ ఎప్పుడొస్తుందో చూడాలి.

- Advertisement -