Samantha: అందరూ అనుకున్నదే నిజం..సామ్ త్వరలోనే ఓ ఇంటిది కాబోతుంది..!

G K

Samantha: అందరూ అనుకున్నదే నిజం..సామ్ త్వరలోనే ఓ ఇంటిది కాబోతుంది..! అవును అక్కినేని నాగ చైతన్యతో వివాహం లగ్జరీ లైఫ్..అనూహ్యంగా విడాకులు ..ఈ వ్యవహారాలన్ని అందరికీ తెలిసిందే. సమంత – నాగ చైతన్యల పెళ్లి తర్వాత అన్నపూర్ణ స్టూడియోలో వారికి నచ్చినట్టుగా ఓ గెస్ట్ హౌజ్ కట్టించుకున్నా రట. ఇక గచ్చిబౌలీలోని ఖరీదైనా ఫ్లాట్ కూడా కొనుగోలు చేశారు. అందులోనే చైతూ – సామ్ నివసించారు. కానీ, ఇద్దరు విడాకులు తీసుకున్న తర్వాత సమంత కే చైతూ ఆ ఫ్లాట్ ఇచ్చేశారని ఆ మధ్య వార్తలు వచ్చాయి. దాని ఖరీదు దాదాపు రూ. 3 కోట్ల వరకు ఉంటుందని చెప్పుకున్నారు.

ఇక సమంత గురించి సోషల్ మీడియాలో చాలా రకాల వార్తలు వచ్చాయి. ఆమె ఇక హైదరాబాద్ వదిలి చెన్నైకి షిఫ్ట్ అవుతోందని, ముంబైకి మకాం మార్చబోతుం దని ప్రచారం జరిగింది. ఈ విషయాలను అప్పుడు సమంత కొట్టిపారేసింది. నా ఇల్లు హైదరాబాద్‌లోనే ఉందని.. హైదరాబాద్ వదిలి వెళ్ళేదే లేదని ఓపెన్‌గా వెల్లడించింది. అయితే, తాజా సమాచారం మేరకు సమంత పలు బాలీవుడ్ మూవీస్ కమిటవబోతుండటం వల్ల నిజంగానే ముంబైకి మకాం మార్చబోతుందని తెలుస్తోంది. అయితే, అది పూర్తి స్థాయిలో కాదట.

samantha-is-going-to-buy-a-new-house-in-mumbai
samantha-is-going-to-buy-a-new-house-in-mumbai

Samantha: త్వరలోనే అమ్మడు ముంబైలో ఇల్లు కొనుక్కోనుందట.

అక్కడ సమంత ఓ ఖరీదైన ఇల్లు కొనుగోలు చేయాలని ప్లాన్ చేసుకుంటుందట. ఇటీవలే పూజా హెగ్డే ముంబైలోని బాంద్రాలో ఓ ఖరీదైన ఫ్లాట్ కొనుగోలు చేసింది. ఇంటి గృహప్రవేశం కూడా జరిగింది. ఈ క్రమంలోనే సమంత అక్కడ మేకర్స్‌కు సన్నిహితులకు మంచి ఇల్లు కావాలని.. అందుకు సంబంధించిన రిక్వైర్మెంట్స్ కూడా ఇవే అని అల్ట్రా స్టైలిష్‌గా ఇల్లు ఉండేలా అత్యంత విలాసవంతంగా సముద్రపు తీరాన ఇల్లు ఉండేలా సాలీడ్ ఇంటీరియర్ డిజైనింగ్‌తో ఉండే ఇల్లు కావాలని చెప్పిందట. త్వరలోనే అమ్మడు ముంబైలో ఇల్లు కొనుక్కోనుందట. మొత్తానికి సమంత ఓ ఇంటిది కాబోతున్న విషయం నిజం కానుందని తెలుస్తోంది.

- Advertisement -