Samantha: అక్కినేని అన్నదమ్ములకు ఒకేసారి గట్టి స్ట్రోక్ ఇవ్వబోతున్న సమంత..!

G K

Samantha: అక్కినేని అన్నదమ్ములకు ఒకేసారి గట్టి స్ట్రోక్ ఇవ్వబోతున్న సమంత..! అంటూ తాజాగా సోషల్ మీడియాలో వార్తలు మొదలయ్యాయి. దానికి కారణం లేకపోలేదు. నాగ చైతన్యతో విడాకులు తీసుకున్న సమంత ఆ తర్వాత తన మీద పోటీ అన్నట్టుగానే సినిమాలను కమిటవుతోంది. అంతేకాదు, వీలైనంత త్వరగా సినిమాలను కంప్లీట్ కూడా చేస్తోంది. ఇప్పటికే శాకుంతలం, కణ్మణి రాంబో ఖతీజా సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్న సమంత తాజాగా మరో సినిమా విడుదల తేదీని కన్‌ఫర్మ్ చేసింది. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే సమంత నటిస్తున్న సినిమా విడుదల తేదీతో అక్కినేని అన్నదమ్ముల కు షాకిచ్చింది.

అక్కినేని నాగ చైతన్య బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న సినిమా లాల్ సింగ్ చద్దా. బాలీవుడ్ మిస్టర్ పర్‌ఫెక్ట్ ఆమిర్ ఖాన్ – కరీనా కపూర్ నటిస్తున్న ఈ సినిమాలో చైతూ కీలక్ పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ సినిమా పలు వాయిదాల తర్వాత ఈ ఏడాది ఆగస్టు 11న రిలీజ్ చేస్తున్నట్టు మేకర్స్ ప్రకటించారు. లవ్ స్టోరి, బంగార్రాజు సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్న చైతూ ఈ బాలీవుడ్ డెబ్యూ మూవీపై భారీగా అంచనాలు పెట్టుకున్నాడు. ఇక తన తమ్ముడు అఖిల్ మూడు వరుస ఫ్లాప్స్ తర్వాత మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ సినిమాతో సాలీడ్ హిట్ అందుకున్నాడు.

Samantha: అఫీషియల్ కన్‌ఫర్మేషన్ ఇస్తూ పోస్టర్ విడుదల..!

ఇప్పుడు సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఏజెంట్ సినిమాలో నటిస్తున్నాడు. సూపర్ స్పై యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ సినిమా రూపొందుతుండగా, ఆగస్టు 12న రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. అయితే, తాజాగా సమంత ప్రధాన పాత్రలో నటిస్తున్న యశోద సినిమా విడుదల తేదీని ప్రకటించింది చిత్రబృందం. ఈ సినిమాను ఆగస్టు 12వ తేదీన రిలీజ్ చేస్తున్నారు. ఈ మేరకు మేకర్స్ తాజాగా విడుదల తేదీతో కూడుకున్న అఫీషియల్ కన్‌ఫర్మేషన్ ఇస్తూ పోస్టర్ విడుదల చేశారు. దాంతో అక్కినేని అన్నదమ్ములకు ఒకేసారి స్ట్రోక్ ఇవ్వబోతున్న సమంత అని చెప్పుకుంటున్నారు.

- Advertisement -