Samantha – Naga Chaitanya: సామ్ చైతూ ఒకటి కాబోతున్నారా.. గొడవలు తగ్గడంతో ఈ నిర్ణయం?

Akashavani

Samantha – Naga Chaitanya: టాలీవుడ్ ప్రపంచానికి సమంత గురించి ప్రత్యేకించి పరిచయం అక్కర్లేదు. ఏ మాయ చేశావే చిత్రం ద్వారా తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ.. ఆపై పలువురు స్టార్ హీరోల సరసన నటించి నటనలోనూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఇక తన అందంతో ఎంతో మంది అభిమానులను ఆకట్టుకుంది ఈ అమ్మడి.

ప్రస్తుత టాలీవుడ్ స్టార్ హీరోయిన్ లలో తాను ఒకటిగా ఓ వెలుగు వెలిగింది. ఇక అదే క్రమంలో అక్కినేని వారసుడు నాగచైతన్య ను ప్రేమ పెళ్లి చేసుకుని సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఇక వీరిద్దరి దంపతులు సెలబ్రెటీలు సైతం జలసీ గా ఫీల్ అయ్యేలా ఇండస్ట్రీలో హడావిడి చేసేవారు. ఇక చాలామంది కపుల్స్ కి ఈ జంటకు ఇన్స్పిరేషన్ గా మారారు.

ఇక కొంత కాలానికి ఏమైందో కానీ ఈ జంట తమ దాంపత్య జీవితానికి విడాకులు రూపంలో బ్రేక్ అప్ చెప్పుకున్నారు. ఈ వార్త ను నార్మల్ పీపుల్ నుంచి సెలబ్రెటీలు వరకూ ఎవరు యాక్సెప్ట్ చెయ్యలేకపోయారు. కానీ ఈ జంట మాత్రం విడిపోయి కెరీర్ పరంగా ముందుకు వెళ్లే ప్రయత్నంలో ఉన్నారు.

Samantha - Naga Chaitanya: సామ్ చైతూ ఒకటి కాబోతున్నారా.. గొడవలు తగ్గడంతో ఈ నిర్ణయం?
Samantha – Naga Chaitanya: సామ్ చైతూ ఒకటి కాబోతున్నారా.. గొడవలు తగ్గడంతో ఈ నిర్ణయం?

Samantha – Naga Chaitanya: సమంత నాగ చైతన్యలు మళ్లీ కలవబోతున్నారు అని చెప్పడానికి కారణం ఇదే!

ఇక అప్పటి నుంచి అభిమానులు ఈ జంట మళ్లీ కలిస్తే బావుంటుంది అని సోషల్ మీడియాలో పోస్ట్ ల ద్వారా తమ అభిప్రాయాలు చెప్పేవారు. ఇక తాజాగా ఈ జంట మరోసారి కలుస్తున్నారని తెలుస్తుంది. అదెలా అంటే.. ఇటు సమంతతో అటు నాగచైతన్యతో మంచి ర్యాపో ఉన్న దర్శకురాలు నందిని రెడ్డి.

ఇక ఈ జంట హీరో హీరోయిన్లుగా నందిని రెడ్డి గతంలోనే ఫిక్స్ చేసి ఒక స్టోరీ ని ముందుకు తీసుకువచ్చింది. కానీ జంట విడిపోవడంవల్ల ఆ స్టొరీ అలాగే ఆగిపోయింది. ఇక మళ్లీ ఆ సినిమాలో ఈ జంట నటించడానికి నందినిరెడ్డి ఒప్పించే ప్రయత్నంలో ఉన్నట్లు ఇన్సైడ్ టాక్ నడుస్తుంది. ఇక మెల్లమెల్లగా గొడవలు తగ్గడంతో నందిని రెడ్డి ఆ జంటను ఒప్పించే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది.

- Advertisement -