Samantha – Nagachaitanya: సమంత నాగచైతన్య విడిపోయి మూడు సంవత్సరాలు అవుతున్న వీరి విడాకుల గురించి తరచూ ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంది. ఇలా వీరిద్దరూ ప్రేమించుకొని పెద్దల సమక్షంలో ఎంతో ఘనంగా వివాహం చేసుకున్నారు. ఈ వివాహం తర్వాత కొంతకాలపాటు ఎత్తు సంతోషంగా ఉన్నటువంటి ఈ జంట అనంతరం విడాకులు తీసుకుని విడిపోయారు. ఇక వీరి విడాకుల గురించి ఎన్నో రకాల వార్తలు వస్తున్నప్పటికీ ఈ సెలబ్రిటీలు మాత్రం పెద్దగా పట్టించుకోలేదు.
ఇదిలా ఉండగా తాజాగా సమంత ఖుషి సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సమంత ప్రేమించుకుని కుటుంబ సభ్యులను ఎదిరించి పెళ్లి చేసుకుంటారు. అయితే సమంత తండ్రి మాట్లాడుతూ సమంత జాతకంలో నాడీకూటదోషం ఉందని ఈ దోషం కారణంగా వారు పెళ్లి చేసుకుంటే విడిపోతారు అంటూ చెబుతారు. ఈ మాటలను లెక్కచేయకుండా సమంత విజయ్ దేవరకొండ పెద్దవారిని ఎదిరించి పెళ్లి చేసుకుంటారు. ఈ సినిమా ద్వారా సమంత నాగచైతన్య విడాకుల గురించి మరొక వార్త వైరల్ అవుతుంది.
దోష పరిహారం చేయకపోవడమే కారణమా..
సినిమాలో చూపించిన విధంగానే సమంత నాగచైతన్య జీవితంలో కూడా ఇలాంటి దోషం ఉందని ఈ దోష పరిహారం చేయకపోవటం వల్లే వారికి విడాకులు వచ్చాయి అంటూ ఓ వార్త సంచలనంగా మారింది. సమంత నాగచైతన్య జాతకంలో దోషం ఉందని పెళ్లి చేసుకుంటే విడిపోతారని జ్యోతిష్యులు వేణు స్వామి చెప్పారు. ఆయనప్పటికీ అక్కినేని ఫ్యామిలీ ఇలాంటి వాటిని పెద్దగా పట్టించుకోకపోవడం వల్లే వీరిద్దరి చేత అలాంటి హోమం చేయించలేదని అందుకే వీరి పెళ్లి కొద్ది రోజులకే పెటాకులుగా మారింది అంటూ ఓ వార్త వైరల్ అవుతుంది.