Samantha : అందాల తార సమంత నాగ చైతన్య కి గుడ్ బాయ్ చెప్పడంతో సోషల్ మీడియాలో ఎంతో నెగిటివిటీ ని ఫేస్ చేస్తుంది. అయితే ఇప్పుడు అది క్రమక్రమంగా తగ్గుతున్న నేపథ్యంలో.. సమంత తాజాగా చేసిన పని వల్ల మళ్ళీ తిరిగి నెగిటివిటీని మూటగట్టుకుంది.
అసలు విషయం ఏమిటంటే.. హీరోయిన్ సమంత పాన్ ఇండియా మూవీ అయిన పుష్ప చిత్రంలో ఓ ఐటమ్ సాంగ్ చేసింది. ఊ అంటావా మావా..ఉహు అంటావా మావ అనే ఐటమ్ సాంగ్ పురుషులను కించపరిచే విధంగా ఉండటంతో సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ పాట ఎంత దుమారం రేపిందంటే… పలు పురుష సంఘాలు కూడా కోర్టులో కేసులు పెట్టారు.
సమంత ఏ పని చేసిన ఏ కార్యక్రమంలో పాల్గొన్న నాగచైతన్య విషయాన్ని కొందరు తీసుకొచ్చి చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఈ మేరకు తాజాగా ఓ నెటిజెన్ సమంతాపై సంచలనమైన కామెంట్ చేశాడు. సమంత నువ్వు సెకండ్ హ్యాండ్ అని, నాగచైతన్య లాంటి జెంటిల్మెన్ దగ్గర అప్పనంగా రూ.50 కోట్లు దొబ్బింది అని ట్విట్టర్ ద్వారా ఓ నెటిజెన్ ఆరోపించాడు.
ఈ కామెంట్ చూసిన సమంత అతనికి దిమ్మతిరిగిపోయే రిప్లై ఇచ్చింది. ఆ దేవుడు నిన్ను చల్లగా చూడు గాక అంటూ సమంత చాలా కూల్ గా అతనికి కౌంటర్ ఇచ్చింది. మీరు ఇలాంటి వెధవలకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని సమంత అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. అది వాళ్ళ పర్సనల్ లైఫ్ వాళ్ళ ఇష్టం మధ్యలో సమంత ని ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు అంటూ పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
నాగచైతన్య తో విడిపోయిన తర్వాత సమంత వరుస సినిమా అవకాశాలు అందుకుంటూ టాలీవుడ్, బాలీవుడ్ ఇండస్ట్రీలో దూసుకెళుతోంది. అలాగే సమంత మునుపటికన్నా రెమ్యూనరేషన్ భారీగా పెంచింది. ఇక సినిమాల విషయానికొస్తే సమంత గుణశేఖర్ తెరకెక్కించిన శాకుంతలం మూవీ షూటింగ్‌ని పూర్తి చేసింది. తమిళంలో విజయ్ సేతుపతి తో ” కాత్తు వాక్కుల రెండు కాదల్ ” అనే చిత్రం చేస్తుంది. అలాగే హాలీవుడ్లో ఓ చిత్రంలో నటిస్తుంది.