Samantha: టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్నటువంటి సమంత ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్నటువంటి మహేష్ బాబుతో కలిసి రెండు సినిమాలలో నటించిన సంగతి మనకు తెలిసిందే. ఒకటి అందుకు కూడా సినిమా కాక మరొకటి సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు ఈ రెండు సినిమాలు బ్లాక్ బాస్టర్ హిట్ అందుకున్నాయి. అయితే గతంలో సమంత త్రివిక్రమ్ శ్రీనివాస్ మహేష్ బాబును ఇంటర్వ్యూ చేసినటువంటి ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోలో భాగంగా సమంత మహేష్ బాబును ఆసక్తికరమైనటువంటి ప్రశ్న అడిగారు.
ఈ సందర్భంగా సమంత ప్రశ్నిస్తూ మీ షర్టు వెనుక ఉన్నటువంటి సిక్స్ ప్యాక్ బాడీని ఎప్పుడు ప్రేక్షకులకు చూపించబోతున్నారు అంటూ ప్రశ్నించారు. సమంత ఇలా ప్రశ్నించడంతో మహేష్ బాబు ఈ ప్రశ్నకు సమాధానం చెబుతూ నా బాడీ నేను ఎవరికి చూపించను.. నా బాడీని ఎవరు చూడరు అంటూ మహేష్ సమాధానం చెప్పడంతో వెంటనే సమంత అదేంటి మహేష్ గారు ప్రేక్షకులను అంత డిసప్పాయింట్ చేశారు అంటూ మాట్లాడారు పక్కనే ఉన్నటువంటి త్రివిక్రమ్ గారితో సమంత మాట్లాడుతూ…
నేను ఎవరికీ చూపించను…
కనీసం మీరైనా మహేష్ బాబు గారి సిక్స్ ప్యాక్ బాడీని ప్రేక్షకులకు చూపించే ప్రయత్నం చేయండి అంటూ సమంత త్రివిక్రమ్ శ్రీనివాస్ ను కూడా రిక్వెస్ట్ చేస్తుంది ప్రస్తుతం ఇందుకు సంబంధించినటువంటి ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇలా మహేష్ బాబు త్రివిక్రమ్ శ్రీనివాస్ సమంత మధ్య జరిగినటువంటి ఈ ఇంటర్వ్యూకు సంబంధించినటువంటి వీడియో వైరల్ గా మారడంతో ఎన్నో విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇకపోతే సమంత మహేష్ బాబు కాంబినేషన్ లో ఇప్పటివరకు రెండు సినిమాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. మరోసారి వీరి కాంబినేషన్లో సినిమా వస్తే చూడాలని వీరిద్దరి ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.