NTR – Sekhar Master:ఎన్టీఆర్ పేరు చెప్పి అడ్డంగా బుక్కైన శేఖర్ మాస్టర్…?

G K

NTR – Sekhar Master:ఎన్టీఆర్ పేరు చెప్పి అడ్డంగా బుక్కైయ్యాడు ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్. ప్రస్తుతం టాలీవుడ్‌లో బాగా బిజీగా ఉన్న డాన్స్ మాస్టర్ ఎవరంటే శేఖర్ మాస్టర్ అని అందరూ ఠక్కున చెప్తున్నారు. జానీ మాస్టర్, ప్రేం రక్షిత్, గణేశ్ మాస్టర్..ఇలా చాలా మంది ఉన్నాకూడా శేఖర్ మాస్టర్ చేస్తున్న సాంగ్స్ మరే మాస్టర్ చేయడం లేదనే చెప్పాలి. చిన్న హీరోల దగ్గర్నుంచి మెగాస్టార్ చిరంజీవి లాంటి వారి వరకు దాదాపు అందరికీ కొరియోగ్రఫీ అందిస్తున్నారు.

అయితే, ఇప్పుడు ఎక్కడ చూసినా టాపిక్ సర్కారు వారి పాట సాంగ్స్ గురించే. ఈ సినిమాలో కళావతి, పెన్నీ సాంగ్స్ ఇప్పటికే రిలీజై ఆకట్టుకున్నాయి. అలాగే, త్వరలో మాస్ సాంగ్ కూడా రిలీజ్ కాబోతోంది. ఈ మూడు పాటలను శేఖర్ మాస్టర్ డాన్స్ కొరియోగ్రఫీ అందించారు. మే 12న సర్కారు వారి పాట సినిమా భారీ స్థాయిలో రిలీజ్ కాబోతోంది. ఈ నేపథ్యంలో జోరుగా ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే శేఖర్ మాస్టర్ కూడా పలు ఆసక్తికరమైన విషయాలు చెప్పుకొచ్చారు.

sekhar-master comments on ntr
sekhar-master comments on ntr

NTR – Sekhar Master: శేఖర్ మాస్టర్‌ను నెగిటివ్‌గా కామెంట్స్ చేస్తున్నారట.

అయితే, ఆయన సర్కారు వారి పాట గురించి ఎంత చెప్పినా ఓకే గానీ, ఇదే సమయం లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ గురించి మాట్లాడి బుక్కైయ్యాడని అంటున్నారు. టాలీవుడ్ హీరోలలో అందరికంటే బాగా డాన్స్ చేసేది ఎన్టీఆర్..అసలు రిహార్సల్స్ చేయకుండా డైరెక్ట్‌గా సెట్ కొచ్చి అక్కడికక్కడే సాంగ్ కంప్లీట్ చేస్తారని చెప్పుకొచ్చాడు. దాంతో ఇటు మహేశ్ అభిమానులతో పాటు మిగతా స్టార్ హీరోల ఫ్యాన్స్ బాగా హర్ట్ అవుతున్నారు. ఎన్టీఆర్ తప్ప మిగతా హీరోలు బాగా డాన్స్ చేయరా…డాన్స్ ప్రాక్టీస్ చేయడానికి ఎంత సమయం తీసుకుంటారు…అంటూ శేఖర్ మాస్టర్‌ను నెగిటివ్‌గా కామెంట్స్ చేస్తున్నారట.

- Advertisement -