Yemaya chesave : ఏ మాయ చేశావే..పెద్ద సెన్షేషనల్ హిట్ సాధించిన సినిమా. ఈరోజు స్టార్ హీరోయిన్‌గా సౌత్ ని ఏలుతున్న సమంత మొదటి సినిమా. అక్కినేని నాగ చైతన్య – సమంతలను ప్రేమలో దింపిన సినిమా. ఈ సినిమాతో యూత్ అంతా కొత్త రకమైన ప్రేమను చూసిన సినిమా. గౌతం వాసుదేవ్ మీనన్ ఇటు తెలుగులో అటు తమిళంలో ఒకే కథతో భారీ హిట్ అందుకున్న ఏ మాయ చేశావే అందరినీ ఆకట్టుకుంది. స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఇందులో ఓ ముఖ్య పాత్రలో కనిపించారు.
ఈ సినిమాతో నాగ చైతన్య – సమంత బ్లాక్ బస్టర్ అందుకున్నారు. స్క్రీన్ ప్లే పరంగా పలువురు ప్రశంసలు అందుకుంది. అయితే ఈ సినిమా చూసిన నాగార్జున తండ్రి నాగ చైతన్య తాతగారు..సీనియర్ స్టార్ హీరో అక్కినేని నాగేశ్వరరావు గారు మాత్రం సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సినిమా సక్సెస్ మీట్‌లో ఎంత ప్రేమ కథ అయితే మాత్రం ఆ ముద్దులు పెట్టుకోవడం ఏంటీ ..అన్ని ముద్దులు అంటే చూడటానికి ఫ్యామిలీ ఆడియన్స్‌కి ఎబ్బెట్టుగా ఉండదా..ఆ డైరెక్టర్ ఎలా తీశాడో..హీరో, హీరోయిన్ ఎలా యాక్ట్ చేశారో.
Yemaya chesave : అందుకే ఇంత పెద్ద హిట్ అయిందని చివరిలో కన్విన్సింగ్ గా మాట్లాడారు.
మా జనరేషన్‌లో హీరో, హీరోయిన్ మధ్య రొమాంటిక్ సీన్స్ ఉండేవి. కానీ అవి అందరూ కలిసి కూర్చొని చూసే విధంగా ఉండేవి. కాని ఇప్పుడు జనరేషన్ మారిపోయింది. యూత్ కి కావాల్సింది రైటర్లు రాస్తున్నారు. డైరెక్టర్లు తీసుకున్నారు. హీరో, హీరోయిన్లు అందులో లీనమై నటిస్తున్నారు. తప్పదు ఇప్పటి తరానికి ఏం కావాలో అది ఇవ్వాలి. కానీ ఏదైనా లిమిట్ లో ఉండాలి. లేదంటే ప్రేక్షకులు తిరస్కరించే ప్రమాదం ఉంది. అయితే ఏ మాయ చేశావే యూత్ కి అలాగే ప్రేక్షకులకు బాగా నచ్చింది. అందుకే ఇంత పెద్ద హిట్ అయిందని చివరిలో కన్విన్సింగ్ గా మాట్లాడారు.