Serial Actress: ఆన్ స్క్రీన్ లో కొట్టుకు చస్తారు.. ఆఫ్ స్క్రీన్ లో ఊపుకుంటూ డ్యాన్స్ లు!

Akashavani

Serial Actress: సాధారణంగా సినిమా అయినా సీరియల్ అయినా హీరోకి పోటీగా విలన్ తప్పనిసరిగా ఉండాల్సిందే. ఇలా విలన్ గా ఉన్నప్పుడే ఆ సినిమా లేదా సీరియల్ ఎంతో ఆసక్తికరంగా మారుతుంది. అందుకోసమే ప్రస్తుత కాలంలో ఎంతో మంది హీరోలకు పోటీగా స్టార్ హీరోలను విలన్ గా పెడుతున్నారు. అయితే ఇలా కేవలం సినిమాల్లో మాత్రమే కాకుండా సీరియల్స్ లో కూడా లేడీ విలన్ క్యారెక్టర్ లకు ఎంతో మంచి క్రేజ్ ఉంది. ఈ విధంగా సీరియల్స్ ద్వారా విలన్ పాత్రలో నటించి మెప్పించిన వారు ఎంతో మంది ఉన్నారు. ఇలాంటి వారిలో ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ విలన్ యాంకర్ ప్రశాంతి ఒకరు.

యాంకర్ ప్రశాంతి ఒకప్పుడు పలు కార్యక్రమాలకు యాంకర్ గా వ్యవహరిస్తూ బిజీగా ఉండేవారు. ప్రస్తుతం ఈమె ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లో విలన్ పాత్రలో నటిస్తున్నారు. ఇక ఈ సీరియల్ లో హీరోయిన్ పాత్రలో హీరోయిన్ కస్తూరి కీలక పాత్రలో నటిస్తున్నారు. వీరిద్దరూ కలిసి ఈ సీరియల్ లో ఒక్కరినే భర్తగా చేసుకున్నారు. ఈ క్రమంలోనే తన భర్త కోసం ఇద్దరూ పెద్ద ఎత్తున గొడవ పడుతూ ఉంటారు. తులసి పాత్రలో నటిస్తున్న కస్తూరిని ఎలాగైనా అవమాన పరచాలని అణగదొక్కాలని లాస్య పాత్రలో నటిస్తున్న ప్రశాంతి ఎత్తుకు పైఎత్తులు వేస్తూ నిత్యం కొట్టుకుంటూ ఉంటారు.

Serial Actress: ఆన్ స్క్రీన్ లో కొట్టుకు చస్తారు.. ఆఫ్ స్క్రీన్ లో ఊపుకుంటూ డ్యాన్స్ లు!
Serial Actress: ఆన్ స్క్రీన్ లో కొట్టుకు చస్తారు.. ఆఫ్ స్క్రీన్ లో ఊపుకుంటూ డ్యాన్స్ లు!

Serial Actress: రచ్చ చేస్తున్న నటీమణులు…

అయితే ఇలా కొట్టుకోవడం కేవలం ఆన్ స్క్రీన్ పై మాత్రమేనండోయ్..ఆఫ్ స్క్రీన్ లో వీరందరూ కలిసి చేసే రచ్చ మామూలుగా ఉండదు. షూటింగ్ సమయంలో ఏ మాత్రం ఖాళీ దొరికినా సీరియల్ లో నటించే నటీనటులు అందరూ కలిసి రీల్స్ చేస్తూ ఆ వీడియోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ అభిమానులను సందడి చేస్తుంటారు.ఈ క్రమంలోనే ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ హీరోయిన్ విలన్ ఇద్దరూ కూడా ఇలాంటి వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఒక్కసారిగా ఈ రీల్ వైరల్ గా మారింది. ఈ క్రమంలోనే ఎంతోమంది ఈ రీల్ వీడియో చూసి టీవీలో ఇద్దరూ కొట్టుకు చస్తారు కానీ ఇక్కడ మాత్రం ఇద్దరూ తెగ ఊపుకుంటూ డాన్స్ లు వేస్తున్నారు అంటూ పెద్ద ఎత్తున వీరి డాన్స్ రీల్ పై కామెంట్లు చేస్తున్నారు.

- Advertisement -