Shalini pande : టాలీవుడ్‌లో ఓ సంచలనం సృష్ఠించిన సినిమా అర్జున్ రెడ్డి. విజయ్ దేవరకొండ రౌడీ స్టార్ అనే ఇమేజ్‌ను తీసుకు వచ్చింది. యూత్ ఆడియన్స్ కి విపరీతంగా నచ్చిన ఈ సినిమాతో శాలినీ పాండే హీరోయిన్‌గా టాలీవుడ్‌కి పరిచయం అయింది. మొదటి సినిమాతోనే యూత్ కి బాగా నచ్చేసి..బాగా క్రేజ్ సంపాదించుకుంది. అర్జున్ రెడ్డి సినిమా బోల్డ్ గా రూపొందించినప్పటికి ఎక్కడా కూడా తన కాస్ట్యూంస్ గాని, గ్లామర్ గాని శృతి మించలేదు. లిప్ లాక్స్ బాగా ఉన్నప్పటికి ఎక్స్‌పోజింగ్ విషయంలో హద్దులు దాటలేదు. అయితే కారణం ఏంటో తెలీదు గానీ శాలినీ పాండేకి అర్జున్ రెడ్డి తర్వాత వస్తాయనుకున్న క్రేజీ ఆఫర్స్ రాలేదు.

Shalini pande ith her stuunig loloks
Shalini pande ith her stuunig loloks

నందమూరి కళ్యాణ్ రాం తో 118, యువ నటుడు రాజ్ తరుణ్‌తో ఇద్దరి లోకం ఒకటే సినిమాలు చేసింది. వీటిలో 118 సూపర్ హిట్ గా నిలిచింది. కానీ ఇద్దరి లోకం ఒకటే ఫ్లాప్ గా మిగిలింది. వీటిలో కూడా చాలా పద్దతిగా కనిపించింది. ఇక టాలీవుడ్‌లో అవకాశాలు రాకపోవడంతో కోలీవుడ్‌లో ఓ సినిమా అవకాశం దక్కించుకొని కొన్ని రోజులు షూటింగ్‌లో కూడా పాల్గొనిందట. ఇంతలోనే బాలీవుడ్ బడా నిర్మాణ సంస్థలో నాలుగు సినిమాలలో నటించే అవకాశం వచ్చి నిర్మాణ సంస్థకి అగ్రిమెంట్ చేసింది. దాంతో కోలీవుడ్‌లో కమిటయిన సినిమాకి సైడ్ ఇచ్చి ముంబై చెక్కేసింది.

Shalini pande : లేటెస్ట్ గ్లామర్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఆ మధ్య ఈ విషయమై సోషల్ మీడియాలో వరుసగా కథనాలు కూడా వచ్చాయి. ఇదిలా ఉంటే అమ్మడు బాలీవుడ్‌లో అడుగుపెట్టగానే తన నడవడికలో..దుస్తుల్లో ఊహించనంతగా మార్పు వచ్చింది. ఎప్పటికప్పుడు హాట్ హాట్ ఫోజులతో స్టన్నింగ్ లుక్స్ ఇచ్చి జనాలను ఆకట్టుకుంటోంది. ఒకరకంగా హిందీ సినిమాలలో హీరోయిన్ అవకాశాలు దక్కించుకోవాలంటే బోల్డ్ అండ్ గ్లామర్ ఫొటో షూట్స్ తో ఆకట్టుకునేందుకే ప్రయత్నాలు చేస్తుంటారు. అందుకు ఉదాహరణ పూజా హెగ్డే, కియారా అద్వానీనే. అదే దారిలో ఇప్పుడు అర్జున్ రెడ్డి బ్యూటీ శాలినీ పాండే కూడా వెళుతోంది. ప్రస్తుతం ఈమె లేటెస్ట్ గ్లామర్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Stay on top of the game with the latest updates on Telugu latest news today! Experience the thrill of LIVE Telugu news updates like never before, only on Teluguonlinenews.com.

Mail

Published on జూలై 21, 2021 at 9:22 ఉద.