NTR: తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి వారిలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఒకరు. ఈయన హీరోగా తెలుగు చిత్ర పరిశ్రమలో మాత్రమే కాకుండా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి సక్సెస్ అందుకొని గ్లోబల్ స్టార్ గా గుర్తింపు పొందారు. ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి ఎన్టీఆర్ చిన్నప్పటి నుంచి నందమూరి ఫ్యామిలీకి కాస్త దూరంగానే ఉన్న సంగతి మనకు తెలిసిందే. హరికృష్ణ రెండో భార్య కుమారుడు ఎన్టీఆర్ కావడంతో ఎన్టీఆర్ ఫ్యామిలీ ఈ కుటుంబాన్ని దూరం పెట్టారు.
ఇక హరికృష్ణ మాత్రం తండ్రికి ఒక భర్తగా ఆ కుటుంబానికి చేయవలసినటువంటి అన్ని పనులను దగ్గరండి చేసేవారు అలాగే వీరి బాధ్యతలను హరికృష్ణ తీసుకొని ఏ విధమైనటువంటి లోటు లేకుండా చూసుకున్నారు. ఇలా నందమూరి కుటుంబ వారసులుగా పేరుపొందినటువంటి ఎన్టీఆర్ చిన్నప్పటి నుంచి ఎంతో చలాకిగా ఉండేవారు అలాగే పెద్దలను గౌరవిస్తూ తల్లిదండ్రులకు ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకువచ్చారు. అయితే చిన్నప్పుడే ఎన్టీఆర్ తల్లి శాలిని ఎన్టీఆర్ తో ఒక ప్రామిస్ చేయించుకున్నారట ఆ ప్రామిస్ కారణంగానే ఈయన ఇప్పటివరకు ఏ విధమైనటువంటి మచ్చ లేకుండా పెరిగారని చెప్పాలి.
తల్లిదండ్రులను ఎంతో గౌరవిస్తారు…
ఎన్టీఆర్ చిన్నతనంలోనే శాలిని తనతో మాట్లాడుతూ పెరిగి పెద్దయిన తర్వాత కూడా మహిళల పట్ల అమ్మాయిల పట్ల ఎప్పుడు దురుసుగా ప్రవర్తించకూడదని నీ ప్రవర్తన కారణంగా నందమూరి కుటుంబ పరువు ప్రతిష్టలు ఎప్పటికీ పోకూడదు అలా నడుచుకుంటానని తనకు మాట ఇవ్వమని అడిగారట ఇలా తల్లికి ఇచ్చిన ఈ మాట ప్రకారం ఎన్టీఆర్ ఏ మహిళ పట్ల ఎప్పుడు కూడా అసభ్యంగా ప్రవర్తించినది లేదు ఇతర హీరోయిన్లతో ఎప్పుడూ కూడా ఈయనపై రూమర్స్ వచ్చినది కూడా లేదు. అలాగే కుటుంబ సభ్యులు చూసినటువంటి అమ్మాయిని పెళ్లి చేసుకుని వైవాహిక జీవితంలో కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు.