Karthika Deepam: తెలుగు బుల్లితెర పేక్షకులకు కార్తీక దీపం సీరియల్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. కార్తీకదీపం సీరియల్ అనగానే మనకు ముందుగా వంటలక్క,డాక్టర్ బాబు పేర్లతో పాటు మోనిత అన్న పేరు కూడా వినిపిస్తూ ఉంటుంది. కార్తీకదీపం సీరియల్ లో ఆ రెండు పేర్లతో పాటుగా మంచి గుర్తింపు తెచ్చుకున్న పేరు మోనిత. ఇక సీరియల్ లో మోనిత కనిపించింది అంటే చాలు టీవీ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఆమెను తిడుతూనే ఉంటారు. ఇకపోతే కార్తీకదీపం సీరియల్ జాతీయస్థాయిలో నెంబర్ వన్ రేటింగ్ సీరియల్ గా చరిత్రకెక్కిన విషయం తెలిసిందే.
కాగా కార్తీకదీపం సీరియల్ లో వంటలక్క,డాక్టర్ బాబులను చంపేసి ఆ తర్వాత నెక్స్ట్ జనరేషన్ అంటూ కథను నడిపిస్తున్న విషయం తెలిసిందే. అయితే కార్తీకదీపం సీరియల్ లో ఎప్పుడైతే వంట లెక్క,డాక్టర్ బాబు లను చంపేసి నెక్స్ట్ జనరేషన్ తో కథను నడిపిస్తున్నారు అప్పటినుంచి చాలామంది ఈ సీరియల్ ని చూడటమే మానేశారు. అంతేకాకుండా ఒకప్పుడు టిఆర్పి రేటింగ్ ని కొల్లగొట్టిన ఈ సీరియల్ ఇప్పుడు సగానికి సగం పడిపోయింది. దీనితో మళ్లీ నెంబర్ వన్ స్థానం కోసం గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. ఇక ఇలాంటి పరిస్థితులలో కార్తీకదీపం సీరియల్ మళ్లీ పూర్వ వైభవం అందుకోవాలి అంటే కార్తీక్, దీప,మోనిత కంట్రీ ఇవ్వాల్సిందే. కాగా కార్తీక్,దీప లను చంపేశారు కాబట్టి వాళ్ళు వచ్చే అవకాశం లేదు. ఒకవేళ వారు బతికి వచ్చినా కూడా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎందుకంటే ఇప్పటికే ఎన్నో సీరియల్స్ లో ఇలా చనిపోయిన వారు మళ్లీ తిరిగి వచ్చిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కార్తీకదీపం సీరియల్ లో కార్తీక్ చనిపోవడంతో విధవరాలుగా ఉన్న మోనిత తన బాబుని వేరే వాళ్ళకి అప్పగించి వెళ్ళిపోతుంది.
Karthika Deepam: కార్తీకదీపం సీరియల్ లోకి మోనిత రీ ఎంట్రీ..
కాబట్టి మోనిత రీ ఎంట్రీ ఇస్తే కార్తీకదీపం సీరియల్ రేటింగ్ లో తప్పకుండా పుంజుకోవడమే కాకుండా పూర్వ వైభవం అందుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. అయితే మోనిత ఎంట్రీ ఇస్తుంది అని వార్తలు వినిపించడంతో,ఆమె అభిమానులతో పాటు ఆమె కూడా కార్తీకదీపం సీరియల్ లోకి మళ్లీ రీ ఎంట్రీ ఇవ్వడానికి ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోంది. కాగా ఇటీవలె ఆమె యూట్యూబ్ ఛానల్ లో కార్తీకదీపం లోకి రీ ఎంట్రీ అంటే ఒక వీడియోని కూడా పోస్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఆమె కార్తీకదీపం సీరియల్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు ఆ వీడియో ద్వారా చెప్పకనే చెప్పేసింది. అయితే ఆ వీడియోలో మోనిత అలియాస్ శోభా శెట్టి కార్తీకదీపం సీరియల్ లోకి ఎప్పుడు వస్తారు అని అభిమానులు అడుగుతున్నారు. నాకు కూడా సీరియల్ లోకి రావాలని ఆశగా ఉంది. కాకపోతే రావాలా వద్దా అన్న ఆలోచనలో ఉన్నాను త్వరలోనే దీనిపై మీరు క్లారిటీ ఇస్తాను అని తెలిపింది మోనిత.