Prabhas : పాన్ ఇండియన్ హీరో గా బాహుబలి సక్సెస్ తో ఎదిగాడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. బాహుబలి నుండి ఇప్పటి ఆదిపురుష్ వరకు ప్రభాస్ కమిట్ అయిన మూవీస్ అన్ని కూడా పాన్ ఇండియన్ రెంజ్ లో ఉన్నవే. ప్రస్తుతం మూడు పాన్ ఇండియా సినిమాల్లో నటిస్తున్నాడు. దాదాపుగా 1000 కోట్ల పైనే ఈ సినిమాల బడ్జెట్ ఉండవచ్చని అంచనా. ఒప్పుకున్న మూడు ప్రాజెక్ట్ లలో ఆదిపురుష్ 3డి మూవికే దాదాపు 500 కోట్ల బడ్జెట్ అవుతుందని
భావిస్తున్నారు.

వీటిలో రాధేశ్యామ్ ప్రచార చిత్రాలు సలార్ ఫస్ట్ లుక్ విడుదలై ప్రేక్షకులలో అంచనాలని పెంచాయి. రాధేశ్యామ్ కొద్దిపాటి పెండింగ్ చిత్రీకరణ పూర్తి చేసే
క్రమంలో ఉన్నారు. అలాగే సలార్- ఆదిపురుష్ ప్రస్తుతం చిత్రీకరణ దశలోనే ఉన్నాయి. ఈ కార్యక్రమాలన్ని కరోనా సెకండ్ వేవ్ వల్ల వాయిదా పడ్డాయి .
మేకర్స్ యొక్క అంచనాలని తారుమారు చేస్తున్నాయి. వీటీతో పాటు దర్శకుడు నాగ్ అశ్విన్ తో ఓ సైన్స్ ఫిక్షన్ బ్యాక్ డ్రాప్లో భారీ బడ్జెట్ తో సినిమాని
నిర్మించబోతున్నారు.
Prabhas : ప్రభాస్ ప్లాన్స్ లో మార్పులు…?
ఈ మూడూ సినిమాల షూటింగ్ తర్వాత నాగ్ అశ్విన్ తో జాయిన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నట్లు తెలుస్తుంది. రాధే శ్యామ్ ని ఈ ఏడాది జూలైలో రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. కాని కరోనా కారణంగా ఆగిపోయింది. ఇక సలార్ వచ్చే ఏడాది ఏప్రిల్ లో.. ఆదిపురుష్ ని అదే ఏడాది ఆగస్టులోనూ రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ కరోనా విలయ తాండవం చేస్తుంది. ఇప్పటి పరిస్థితులు అదుపులోకి వస్తేనే షూటింగ్ లు కంటిన్యూ చేసే అవకాశాలు కనపడుతున్నాయి. మరి డార్లింగ్ ప్రభాస్ ఇప్పుడు ఎలా ప్లాన్స్ లో మార్పులు చేసుకుంటాడో వేచి చూడాలిసిందే. కాగా ప్రభాస్ ప్రస్తుతం కమిటైన ప్రాజెక్ట్స్ పూర్తి చేసి ఓ ఏడాది పాటు కొత్త సినిమా అనేదే కమిటవడని తెలుస్తోంది. బాహుబలి నుంచి భారీ ప్రాజెక్ట్స్ చేస్తూ చాలా అలిసిపోవడమే ఇందుకు కారణం అని చెప్పుకుంటున్నారు.