Singer Chinmayi: మ్యూజిక్ లవర్స్ కి సింగర్ చిన్మయి గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. ఇండస్ట్రీలో ఎన్నో పాటలకు ప్రాణం పోసి ప్రస్తుతం టాలీవుడ్ సింగర్స్ లో తాను ఒకటి గా ఓ వెలుగు వెలుగుతుంది. ఇక చిన్మయి లో మరో మంచి తనం కూడా ఉంది. అదేమిటంటే? చాలా మంది అమ్మాయిల భాధలను తెలుసుకొని వాళ్లకు సపోర్టివ్ గా ఉంటుంది.
ఇక అటువంటి అమ్మాయిలు కూడా చిన్మయి కి తమలోని బాధని చెప్పుకోవడానికి బాగా ఇష్టపడతారు. ఇక తాజాగా చిన్మయికి ఒక అమ్మాయి తనకు జరిగిన ఒక చేదు అనుభవం గురించి చెప్పుకొచ్చింది. అది చదివిన చిన్మయి ఒక్కసారిగా ఆందోళన చెందింది. ఇంతకు ఆ అమ్మాయి ఏం చెప్పిందంటే? తనకు 16 సంవత్సరాలు ఉన్నప్పుడు తన తమ్ముడు తనకు ఇష్టం వచ్చిన చోట తాకేవాడు అని తెలిపింది.
ఆ విషయాన్ని తన పేరెంట్స్ కి చెబితే ఈ విధంగా అన్నారట. వాడు ఇప్పుడు ఇప్పుడే ఎదుగుతున్నాడు. యవ్వనం లోకి వస్తున్నాడు. అందుకే వాడు కంట్రోల్ చేసుకోలేక పోతున్నాడు. వాళ్ళు అలాగే ప్రవర్తిస్తూ ఉంటారు. నువ్వే సరిగా నీ శరీరాన్ని దాచుకోవడం లేదని అని తన పేరెంట్స్ అన్నారట. అంతే కాకుండా అది నీ తప్పు నీ తప్పే అయ్యి ఉంటుంది అని చెప్పినట్టు తెలిపింది.
Singer Chinmayi: సింగర్ చిన్మయి సదరు అమ్మాయి తల్లిదండ్రుల మీద ఈ విధంగా విరుచుకుపడింది!
ఇక అమ్మాయి ఆ మాట తో ఇంటి నుంచి బయటకు వెళ్లడానికి సిద్ధమైంది. కానీ తనకు 19 సంవత్సరాలు కావడంతో ఇంటి నుంచి బయటకు వెళ్లలేకపోయింది. ఇక ఈమె బాధలు తెలుసుకున్న చిన్మయి సదరు అమ్మాయి తల్లిదండ్రుల మీద ఒక రేంజ్ లో విరుచుకుపడింది. మీకు అమ్మాయిలు అంటే ఎందుకంత ద్వేషం అంటూ సూటిగా ప్రశ్నించింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరి మీరు ఎందుకు ఆలోచిస్తున్నారు? మీరు కూడా ఆ వీడియో పై ఒక లుక్కేయండి.
This is absolute parenting pits.
Why do we hate our girls so much? Like really! pic.twitter.com/w9vwcFJqRq
— Chinmayi Sripaada (@Chinmayi) June 5, 2022