Sitara: అరెరే.. సమంతను అప్పుడే అంటీని చేసేసిన మహేష్ బాబు కూతురు.. ఇది దారుణం అబ్బా!

Akashavani

Sitara: తెలుగు ప్రేక్షకులకు మహేష్ బాబు కూతురు సితార గురించి ప్రత్యేకించి పరిచయం అక్కర్లేదు. చాలా చిన్న వయసులోనే సోషల్ మీడియాలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. తన తండ్రి పాటలకు డాన్స్ చేస్తూ ఇన్ స్టాగ్రామ్ రీల్స్ రూపంలో హడావిడి చేస్తూ ఉంటుంది.

ఇక తన తండ్రి సినిమా అయినటువంటి సర్కారు వారి పాట సినిమాలో కళావతి పాట విడుదలైన వెంటనే ఆ పాటకు డాన్స్ చేస్తూ సోషల్ మీడియా ప్రియులను మరో లెవెల్ లో ఆకట్టుకుంది ఈ బుడ్డది. మొత్తానికి సితార తన తండ్రి సర్కార్ వారి పాట సినిమాలో పెన్ని ప్రమోషనల్ సాంగ్ లో తన అడుగులు వేసింది.

ఏదేమైనా తండ్రి సినీమాతోనే టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చింది సితార. కానీ ఈ పాట సినిమాలో ఉండదని మహేష్ బాబు ప్రమోషన్ లో భాగంగా తెలిపాడు. కనీసం చివరి లో అయినా వేయచ్చు కదా అని సుమ అడిగింది. దాంతో మహేష్ సితార కు లేనిపోని ఐడియాలు ఇవ్వకండి అని అంటాడు. కాగా సర్కారు వారి పాట సినిమాతో సితార కు సంబంధం ఉంది.

ఇక సితార కూడా ప్రమోషన్ లలో పాల్గొనగా సితార కు మహేష్ తో కలిసి నటించిన హీరోయిన్ల గురించి ప్రశ్న ఎదురవుతుంది. కాగా సమంత, రష్మికల గురించి చెప్పమని అడుగుతారు. దానితో సితార సమంత అని చెప్పుకొస్తూ.. సామ్ ఆంటీ నాకు బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పేసింది. అంతేకాకుండా నాతో ఎక్కువగా ఆడుకుంటుంది అని సితార చెప్పింది.

Sitara: సమంత గురించి సితార ఈ విధంగా చెప్పుకొచ్చింది!

ఈ వీడియో చూసిన సమంత అభిమానులు.. అప్పుడే సమంత ను ఆంటీ ని చేసిందంటూ ఫన్నీ గా కామెంట్ల రూపంలో బాధపడుతున్నారు. మరికొందరు ఇది దారుణం అబ్బ అంటూ.. కామెంట్ చేస్తున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది.

- Advertisement -