Sonam Kapoor: సినిమా ఇండస్ట్రీలో కొంత మంది హీరోయిన్ పెళ్ళి, సంసారం విషయంలో బాగానే ఫాలో అవుతున్నారు. కాస్త ఆలస్యం అయినా మరీ నలబై ఏళ్ళ వరకు ఆగడం లేదు. మూడు పదుల వయసులోనే పెళ్లి చేసుకుంటున్నారు. అంతేకాదు, పెళ్లి తర్వాత భర్తతో కలిసి వైవాహిక జీవితాన్ని ఆనందంగా గడుపుతు న్నారు. పిల్లల విషయంలో కూడా త్వరగానే అడుగు ముందుకు వేస్తున్నారు. ఈ ఏడాదిలో చందమామ కాజల్ అగర్వాల్ కూడా భర్తతో కలిసి చక్కటి వైవాహిక జీవితాన్ని ఆనందిస్తోంది.
ప్రస్తుతం ప్రెగ్నెంట్ అయిన కాజల్ దీనికి సంబంధించిన యాడ్స్‌లో పాల్గొంటుంది. సోషల్ మీడియాలో కూడా నెలలు నిండుతున్న కొద్దీ కొత్త తరహా ఫొటోలను పెడుతూ అభిమానులకు అప్డేట్స్ ఇస్తోంది. ఇక శ్రీయా శరణ్ బిడ్డకు జన్మించిన చాలా నెలల వరకు ఈ విషయాన్ని చాలా గోప్యంగా ఉంచింది. ఐ సినిమాలో హీరోయిన్ అయిన అమీ జాక్సన్ కూడా పెళ్లి కాకుండా తల్లైంది. ఆమె కూడా ఇలాగే బేబీ బంప్ పిక్స్ షేర్ చేసేది. చెప్పాలంటే సినీ తారలకు ఈ అప్డేట్స్ ఇవ్వడం ఒక ఫ్యాషన్‌గా మారింది.

Sonam Kapoor: అభిమానులు రక రకాల కామెంట్స్‌తో రిప్లే ఇస్తున్నారు.
ఈ క్రమంలోనే మరో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సోనమ్ కపూర్ కూడా తాజగా గర్భంతో ఉన్న తాజా ఫొటోలను తన సోషల్ మీడియా ఖాతాలో అభిమానులకు షేర్ చేసింది. డైరెక్షన్ డిపార్ట్మెంట్ నుంచి హీరోయిన్గా మారిన సోనమ్ మంచి కథా బలమున్న సినిమాలలోనే నటించి క్రేజ్ తెచ్చుకుంది. సీనియర్ స్టార్ హీరో అనిల్ కపూర్ కూతురుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చినప్పటికీ తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్ను సంపాదించుకుంది. కెరీర్ మంచి ఊపుమీద ఉన్నా కూడా ప్రేమించి ఓ బిజినెస్ మేన్‌ను పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం సోనమ్ కపూర్ ప్రెగ్నెంట్. త్వరలో ఓ బిడ్డకు జన్మనివ్వబోతున్న ఆమె తాజాగా ఈ విషయాన్ని అభిమానులతో పంచుకుంది. ఈ ఫొటోలకు అభిమానులు రక రకాల కామెంట్స్‌తో రిప్లే ఇస్తున్నారు.