Jagan: ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ వోటింగ్ చేశాడని వైసీపీ పార్టీ సస్పెండ్ చేసిన మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ఇప్పుడు వైసీపీపై, ఆ పార్టీని నడుపుతున్న సీఎం జగన్మోహన్ రెడ్డిపై తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. నిన్న మొన్నటి వరకు వైసీపీ పెద్దలు తనపై అనవసరంగా చర్యలు తీసుకున్నారని, వైసీపీ తానూ ఎప్పుడూ విధేయంగానే ఉన్నానని చెప్పుకోచ్చిన మేకపాటి ఇవ్వాళ మాత్రం జగన్ పై తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేరు చెప్పుకొని జగన్ పేరు పెట్టుకున్నాడు కానీ ఆయనలో ఉన్న లక్షణాలు మాత్రం జగన్ కు రాలేదని మేకపాటి అన్నారు. పార్టీలోని పెద్దలకు వైసీపీలో గౌరవం లేదని వాపోయారు.

నమస్కారం కూడా చెయ్యరు
వైఎస్ జగన్ కు కనీసం పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలకు నమస్కారం చేసే సంస్కారం కూడా లేదని, ఆయనతోపాటు అయన పక్కన ఉన్న వారు కూడా ఎమ్మెల్యేలకు కనీసం మర్యాద ఇవ్వరని మేకపాటి చెప్తున్నారు. పార్టీ ఎమ్మెల్యేల నిర్ణయంతో నడవడం లేదని, ఎమ్మెల్యేలపైన జగన్ సలహాదారులను నియమించడాని, వాళ్ళు చెప్పినట్టే ఎమ్మెల్యేలు కూడా నడుచుకోవాలని, ఇలా పార్టీలోని ఎమ్మెల్యేలను జగన్ అవమానిస్తున్నాడని తెలిపారు. తానూ ఇలా క్రాస్ వోటింగ్ చెయ్యడానికి జగన్ కు తనకు ఎమ్మెల్యే టికెట్ కాకుండా, ఎమ్మెల్సీ టికెట్ ఇస్తానని చెప్పడమే కారణమని చంద్రశేఖర్ చెప్పారు. ఎమ్మెల్యేలను గౌరవించని పార్టీలకు మూతపడుతాయని, త్వరలో జగన్ కూడా వైసీపీని మూసేస్తారని వెల్లడించారు.
50-70 ఎమ్మెల్యేలు వైసీపీని వదిలేస్తారు
వైసీపీ ఇప్పుడు తానొక్కడినే కాదని, తనలా పార్టీలో అసహనంగా ఉన్నవారు చాలామంది ఉన్నారని వాళ్ళందరూ కూడా వచ్చే ఎన్నికల సమయంలో జగన్ కు షాక్ ఇస్తారని మేకపాటి తెలిపారు. ఇప్పటికే దాదాపు 50-70 మంది ఎమ్మెల్యేలు పార్టీలోఅసంతృప్తితో ఉన్నారని, వాళ్ళందరూ ఇలా ఉన్నారని తెలిసి కూడా, జగన్ ఎలా 175 అన్నాడో ఎవ్వరికి అర్థం కావడం లేదని, కేవలం బటన్స్ నొక్కి 175 వస్తాయని అనుకుంటే సరిపోదని, ఉద్యోగులకు సరైన సమయంలో జీతం కూడా ఇవ్వని జగన్ కు వచ్చే ఎన్నికల్లో బుద్ధి చెప్తారని మేకపాటి తెలిపారు. ఒకవేళ వచ్చే ఎన్నికల్లో అసంతృప్తితో ఉన్న వాళ్ళందరూ టీడీపీలోకి వెళ్తే వైసీపీకి ఇంకా రాష్ట్రంలో పుట్టగతులుండవు. ఈ పరిస్థితుల నుండి జగన్ ఎలా బయటపడుతారో వేచి చూడాలి.