sreeja Konidela: అంతుచిక్కని శ్రీజ వ్యవహారం.. భర్తను వదిలేసిందని ఇండస్ట్రీలో టాక్.. సోషల్ మీడియాలో మాత్రం?

Akashavani

sreeja Konidela: గత కొన్ని నెలల నుంచి మెగాస్టార్ చిన్న కూతురు శ్రీజ గురించి ఏ చిన్న విషయం తెలిసిన సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్ గా మారుతుంది. ఈ విధంగా శ్రీజ గురించి నిత్యం ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇలా జరగడానికి గల కారణం ఆమె తన సోషల్ మీడియా ఖాతాలో శ్రీజ కళ్యాణ్ దేవ్ అని ఉన్న పేరును కాస్తా, శ్రీజ కొణిదలగా మార్చుకోవడమే అని చెప్పాలి. ఎప్పుడైతే శ్రీజ తన సోషల్ మీడియా ఖాతా పేర్లను మార్చారో ఆ క్షణం నుంచి వీరిద్దరూ విడిపోతున్నారా? త్వరలోనే విడాకులు తీసుకోనున్నారా? అనే సందేహాలు కలుగుతున్నాయి. ఇలా అప్పటినుంచి సోషల్ మీడియా వేదికగా శ్రీజ ఏ చిన్న పోస్ట్ చేసిన క్షణాల్లో వైరల్ అవుతుంది.

ఈ విధంగా శ్రీజ కళ్యాణ్ గురించి ఈ విధమైన వార్తలు వస్తున్నప్పటికీ కళ్యాణ్ దేవ్ కూడా తన గురించి వస్తున్న వార్తలపై ఏమాత్రం స్పందించలేదు.అలాగే ప్రస్తుతం తన లైఫ్ ఎంతో హ్యాపీగా ఉందంటూ ఈయన కూడా సోషల్ మీడియాలో పోస్టులు చేయడం ఈ అనుమానాలకు మరింత బలం చేకూరుస్తోంది. ఇక గత కొన్ని నెలల నుంచి కళ్యాణ్ మెగా కుటుంబంలో జరిగే వేడుకలకు కూడా హాజరుకాలేదు. దీంతో వీరిద్దరూ విడాకులు తీసుకోవడం ఖాయమని భావిస్తున్నారు. ఇకపోతే శ్రీజ ఇద్దరు పిల్లలు కూడా తన తండ్రి దగ్గర కాకుండా తన తల్లి దగ్గరే ఉన్నట్లు తెలుస్తోంది.గత రెండు రోజుల క్రితం శ్రీజ తన ఇద్దరు పిల్లలతో ఫోటో దిగి ఆ ఫోటోని షేర్ చేస్తూ పిల్లలే తన ప్రపంచమని క్యాప్షన్ ఇచ్చారు.

sreeja Konidela: కళ్యాణ్ ఎక్కడ…

ఇలా పిల్లల తన ప్రపంచమని చెప్పడంతో తన గురించి వస్తున్న అనుమానాలకు బలం చేకూర్చాయి. ఇదిలా ఉండగా తాజాగా శ్రీజ తన సోషల్ మీడియా వేదికగా మరికొన్ని ఫోటోలను షేర్ చేశారు.ఈ ఫోటోలను చూస్తుంటే శ్రీజ తన ఇద్దరు పిల్లలతో కలిసి హాలిడే వెకేషన్ వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోని తన ఇద్దరు కూతుర్లతో శ్రీజ తమిళనాడులోని కోటగిరి హిల్స్ వెకేషన్ వెళ్లారని చెప్పుకొచ్చారు.ఈ క్రమంలోనే ఈ వెకేషన్ కి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా ద్వారా షేర్ చేయడంతో ఈ ఫోటోల పై తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఒక నెటిజెన్ ఈ ఫోటోల పై స్పందిస్తూ కళ్యాణ్ దేవ్ ఎక్కడ అంటూ ప్రశ్నించారు. ఇలా మెగా కుటుంబంలోనే కాకుండా తన భార్య పిల్లలు వెకేషన్ కి వెళ్లినప్పటికీ కళ్యాణ్ దేవ్ దూరంగా ఉన్నారని తెలియడంతో ఇక వీరు విడాకులు తీసుకున్నారని భావిస్తున్నారు. అయితే భర్తకు దూరంగా ఉంటూ విడాకుల గురించి నోరు మెదపకుండా ఉండడంతో శ్రీజ వ్యవహారశైలిపై ఎన్నో సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

- Advertisement -