Sri Reddy : రాత్రి పూట రోడ్డు మీద లారీలు ఆపేదాన్నని ప్రచారాలు చేశారంటూ ఎమోషనల్ అయిన శ్రీ రెడ్డి…

Joythi R

Sri Reddy : ఈ మధ్య తెలుగు నటి శ్రీరెడ్డి సోషల్ మీడియా ఏదో ఒక విషయంపై మాట్లాడుతూ తరచూ వార్తల్లో నిలుస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. దీనికితోడు ఈ అమ్మడు ఎక్కువగా వైకాపా పార్టీపై విమర్శలు చేసిన వారిని టార్గెట్ చేస్తూ ఘాటుగా రిప్లై ఇస్తోంది. అయితే తాజాగా నటి శ్రీరెడ్డి ఇటీవలే హైదరాబాదులో జరిగిన పబ్ సంఘటన గురించి తన అధికారిక సోషల్ మీడియా మాధ్యమమైన ఫేస్ బుక్ ద్వారా స్పందించింది. ఇందులో భాగంగా టాలీవుడ్ ప్రముఖ నటుడు మరియు సినీ నిర్మాత నాగబాబు కూతురు నిహారిక కొణిదెల పబ్ లో పోలీసులకు పట్టుబడిన సంఘటన గురించి మాట్లాడుతూ ఘాటుగా విమర్శలు చేసింది.

ఇందులో భాగంగా ఏకంగా నాగబాబుకి కర్మ ఫలం వెంటాడిందని సంచలన వ్యాఖ్యలు చేసింది. అలాగే గతంలో కొందరు పవన్ కళ్యాణ్ అభిమానులు తనని అసభ్యకరంగా చిత్రీకరిస్తూ తప్పుడు ప్రచారాలు చేశారని దాంతో నేను కూడా చాలా మానసిక క్షోభను అనుభవించానని తెలిపింది. ఈ క్రమంలో మరి కొందరైతే ఏకంగా తాను రాత్రి పూట రోడ్డుపై లారీలు ఆపి ఏదో చేస్తున్నానని అలాగే డబ్బు కోసం ఇంకేదో చేస్తున్నానని తప్పుడు కథనాలు ప్రసారం చేశారని వాపోయింది.

కానీ తాను మాత్రం ఎప్పుడూ కూడా డబ్బు కోసం దిగజారి ప్రవర్తించలేదని స్పష్టం చేసింది. మరి ఇప్పుడు నిహారిక కొణిదెల పబ్బులో దొరికిన సంఘటనపై పిల్ల సైనిక్స్ ఎలా సమర్థించుకుంటారో చూడాలంటూ జన సైనికులను ఎద్దేవా చేసింది. అయితే ఎప్పుడు మెగాస్టార్ ఫ్యామిలీ ని టార్గెట్ చేస్తూ విమర్శించేటువంటి శ్రీ రెడ్డి ని ఈ మధ్యకాలంలో జన సైనికులు పెద్దగా పట్టించుకోవడం లేదు. మరి ఈ విషయంపై ఎలా స్పందిస్తారో చూడాలి.

Sri Reddy : రాత్రి పూట రోడ్డు మీద లారీలు ఆపేదాన్నని ప్రచారాలు చేశారంటూ ఎమోషనల్ అయిన శ్రీ రెడ్డి...
Sri Reddy : రాత్రి పూట రోడ్డు మీద లారీలు ఆపేదాన్నని ప్రచారాలు చేశారంటూ ఎమోషనల్ అయిన శ్రీ రెడ్డి…

అయితే మొన్నటి వరకు సినిమా ఇండస్ట్రీ బహిష్కరణ ఎదుర్కొన్న ఈ అమ్మడు మళ్లీ సినిమాల్లో నటించడం ప్రారంభించింది. అయితే ఈ మధ్య కాలంలో నటి శ్రీ రెడ్డి ఎక్కువగా డిజిటల్ మనీ పై దృష్టిసారించి ఫేస్ బుక్ మరియు యూ ట్యూబ్ వంటి మాధ్యమాల ద్వారా బాగానే సంపాదిస్తోంది. ఈ క్రమంలో ఈ అమ్మడు వంటల వీడియోలు చేస్తూ ఘాటు అందాలు ఆరబోస్తూ రోజు రోజుకి ఫ్యాన్ ఫాలోయింగ్ మరియు క్రేజ్ పెంచుకుంటోంది. అధికారిక ఫేస్ బుక్ ఖాతాకి దాదాపుగా 70 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు.

- Advertisement -