Sridevi Drama Company: బుల్లితెరపై ఎన్నో ఎంటర్టైన్మెంట్ షో లు, ఈవెంట్లు బాగా సందడి చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ముఖ్యంగా పండుగ సందర్భంలో చేసే ఈవెంట్లు మాత్రం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటాయి. అయితే ఫిబ్రవరి 14న ప్రేమికుల రోజు సందర్భంగా ఇప్పటికే పలు ఛానల్స్ లలో కొన్ని ఈవెంట్లు ప్రారంభమయ్యాయి. వాటికి సంబంధించిన ప్రోమోలు కూడా వైరల్ అవుతున్నాయి.
అయితే తాజాగా శ్రీదేవి డ్రామా కంపెనీ కూడా ప్రేమికుల రోజు సందర్భంగా చెప్పు బుజ్జి కన్నా అనే ఈ వెంటనే నిర్వహించింది. ఇక ఈవెంట్ కు బుల్లితెర ఆర్టిస్టులు పాల్గొని బాగా సందడి చేశారు. అంతేకాకుండా హైపర్ ఆది తన కామెడీతో బాగా నవ్వించాడు. మధ్య మధ్యలో పలువురు కమెడియన్స్ తమ పర్ఫామెన్స్ తో ఫిదా చేశారు.
రియర్ కపుల్స్ వచ్చి మరోసారి తమ మధ్య ఉన్న ప్రేమను బయట పెట్టుకున్నారు. అందరూ తమ లైఫ్ పార్ట్నర్లకు గిఫ్ట్ లు ఇవ్వగా వెంటనే పంచ్ ప్రసాద్ కూడా తన భార్యను గిఫ్ట్ కోరాడు. దాంతో ఆమె టాబ్లెట్లు ఇవ్వటంతో అందరూ తెగ నవ్వుకున్నారు. హైపర్ ఆది తోటి కమెడియన్లపై బాగా కౌంటర్లు వేశాడు. అయితే చివర్లో ఇమ్మానుయేల్, వర్ష సరదాగా ఫ్లేమ్స్ ద్వారా తమకు ఏం వస్తుందో తెలుసుకోవాలని చూశారు.
Sridevi Drama Company:
దీంతో హైపర్ ఆది రష్మీ పేరు కూడా బోర్డు మీద రాసి నీ పేరు ఎవరితో చూడను అని అనటంతో వెంటనే అక్కడ కొంతమంది గాలోడు అని గాలి సుధీర్ పేరు తీశారు. వెంటనే హైపర్ ఆది సిద్దు అని ఒకటి రాస్తాను అనడంతో రష్మీ ఆ బోర్డుపై ఉన్న పేపర్ ను కోపంతో చింపేసినట్లు కనిపించింది. అంతేకాకుండా బ్రేకప్ అన్నట్లు చూపించగా రష్మీ చాలా బాధపడుతున్నట్లు కనిపించింది. దీంతో ప్రోమో చూసిన వాళ్లంతా సిద్దు ఎవరు అని ప్రశ్నిస్తున్నారు.