Nayanatara: దక్షిణాది సినీ ఇండస్ట్రీలో లేడీ సూపర్ స్టార్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి నయనతార గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దాదాపు రెండు దశాబ్దాలుగా ఇండస్ట్రీలో నటిగా కొనసాగుతూ ఉన్నటువంటి ఈమె ఇప్పటికీ ఏమాత్రం సినిమా అవకాశాలను కోల్పోకుండా వరుస సినిమా అవకాశాలను అందుకుంటూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. ఈ విధంగా నయనతార తాజాగా షారుక్ ఖాన్ హీరోగా నటించిన జవాన్ సినిమ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో మంచి సక్సెస్ అందుతుంది.
జవాన్ సినిమా ద్వారా నయనతార బాలీవుడ్ ఇండస్ట్రీలోకి కూడా అడుగుపెట్టారు ఇక ఈమె నటనకు బాలీవుడ్ దర్శక నిర్మాతలు ప్రేక్షకులు కూడా చాలా ఇంప్రెస్ అయ్యారట దీంతో ఈమెకు బాలీవుడ్ ఇండస్ట్రీలో అవకాశాలు వరుస కడుతున్నాయని సమాచారం. ఇలా షారుఖ్ ఖాన్ సరసన నయనతార నటించిన మొట్టమొదటి సినిమా ఎంతో మంచి సక్సెస్ కావడంతో బాలీవుడ్ బడా ప్రొడ్యూసర్స్ నయనతార కోసం క్యూబ్ కడుతున్నారని తెలుస్తోంది.
ఏకంగా అన్ని కోట్ల…
ఇక బాలీవుడ్ ఇండస్ట్రీపై నయనతార ఫోకస్ చేయడంతో ఈమె కూడా బాలీవుడ్ సినిమాలలో నటించడానికి ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలోనే తన మొదటి బాలీవుడ్ సినిమా ఎంతో మంచి సక్సెస్ కావడంతో రెమ్యూనరేషన్ విషయంలో మాత్రం నయనతార చాలా కఠినంగా ఉన్నారని రెమ్యూనరేషన్ మాత్రం భారీ స్థాయిలో డిమాండ్ చేస్తున్నారని తెలుస్తుంది. ఇప్పటివరకు బాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్నటువంటి హీరోయిన్లతో సమానంగా సౌత్ ఇండస్ట్రీలో నయనతార రెమ్యూనరేషన్ అందుకు అంటూ రికార్డ్ సృష్టించారు. ఒక్కో సినిమాకు దాదాపు 8 కోట్ల రూపాయలు తీసుకుంటున్నటువంటి నయనతార జవాన్ సినిమా కాస్త సక్సెస్ కావడంతో ఏకంగా 10 కోట్ల రూపాయలకు రెమ్యూనరేషన్ పెంచి నిర్మాతలకు షాక్ ఇచ్చారని తెలుస్తుంది.