Sai pallavi : ఫిదా బ్యూటిగా టాలీవుడ్‌లో ఎంతో క్రేజ్ సంపాదించుకున్న యంగ్ హీరోయిన్ సాయి పల్లవి. ప్రేమమ్ సినిమాతో సినిమా ఇండస్ట్రీకి పరిచయమైన ఈ నేచురల్ బ్యూటీ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా వచ్చిన ఫిదా సినిమాతో టాలీవుడ్‌లో బాగా పాపులారిటీ తెచ్చుకుంది. ఈ సినిమా కోసం సాయి పల్లవిని సంప్రదించినప్పుడు దర్శకుడు శేఖర్ కమ్ముల చెప్పిన నెరేషన్‌కి వెంటనే ఓకే చెప్పిందట. అప్పటికే ఆయన సినిమాలు చూసిన సాయి పల్లవికి అవకాశం వస్తే శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నటించాలని అనుకుందట.

Such a rumor on Sai Pallavi ... how awful

ఇక సాయి పల్లవి అంతక ముందునుంచే తెలుగు ప్రేక్షకులకు బాగానే పరిచయం ఉంది. బుల్లితెర మీద పాపులర్ షో అయిన ఢీ లో సాయి పల్లవి కొన్ని సాంగ్స్‌కి పర్ఫార్మ్ చేసింది. అప్పుడే తన డాన్స్‌తో ఇక్కడ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. డాక్టర్ చదువుతూ సినిమాలలోకి వచ్చిన సాయి పల్లవి సినిమాలు మానేస్తే మాత్రం మళ్ళీ డాక్టర్‌గా ప్రాక్టీస్ మొదలు పెట్టనున్నట్టు కొన్ని సందర్భాలలో చెప్పింది. ఇక గ్లామర్ రోల్స్, కమర్షియల్ యాడ్స్ కి బాగా దూరంగా ఉండే సాయి పల్లవికి ఇప్పుడు టాలీవుడ్‌లో విపరీతమైన క్రేజ్ ఉంది.

Sai pallavi : సాయి పల్లవి.. శేఖర్ కమ్ముల – ధనుష్‌లను కలిపిందని చెప్పుకుంటున్నారు.

మరోసారి శేఖర్ కమ్ముల దర్శకత్వంలో లవ్ స్టోరి సినిమా చేసింది సాయి పల్లవి. నాగ చైతన్య ఇందులో హీరోగా నటించాడు. అయితే తాజాగా శేఖర్ కమ్ముల – ధనుష్ కాంబినేషన్‌లో ఓ పాన్ ఇండియన్ ప్రాజెక్ట్‌గా త్రిభాషా చిత్రం అనౌన్స్ చేశారు. లవ్ స్టోరి నిర్మాతలతో పాటు, శేఖర్ కమ్ముల, ధనుష్ కలిసి నిర్మిస్తున్నారు. ధనుష్‌కి ఇది ఫస్ట్ తెలుగు స్ట్రైట్ సినిమా. అయితే ఈ సినిమా విషయంలో సాయి పల్లవి మీద ఓ రూమర్ వినిపిస్తోంది. ఆమె ఈ ప్రాజెక్ట్ సెట్ చేయించిందని ఇన్‌సైడ్ టాక్. ధనుష్ – సాయి పల్లవిల మధ్య మంచి బాండింగ్ ఉంది. అలాగే శేఖర్ కమ్ముల – సాయి పల్లవిల మధ్య మంచి బాండింగ్ ఉంది. ఈ కారణంగానే సాయి పల్లవి.. శేఖర్ కమ్ముల – ధనుష్‌లను కలిపిందని చెప్పుకుంటున్నారు. ఇక ఈ సినిమాలో హీరోయిన్‌గా సాయి పల్లవినే నటించే అవకాశాలున్నట్టు చెప్పుకుంటున్నారు.

Stay on top of the game with the latest updates on Telugu latest news today! Experience the thrill of LIVE Telugu news updates like never before, only on Teluguonlinenews.com.

Mail

Published on జూన్ 21, 2021 at 11:00 ఉద.