Sukumar: నేనొక్కడినే’ రోజుల్లో మహేష్ బాబు అలా ఉండేవాడు.. సుకుమార్ కామెంట్స్ వైరల్!

Akashavani

Sukumar: తెలుగు రాష్ట్రాల ప్రజలకు డైరెక్టర్ సుకుమార్ గురించి ప్రత్యేకించి పరిచయం అక్కర్లేదు. జగడం సినిమా ద్వారా డైరెక్టర్ గా పరిచయం అయిన ఇతడు ఆ సినిమా విఫలమైనప్పటికీ.. ఆర్య సినిమా తో అద్భుతమైన సక్సెస్ అందుకున్నాడు. ఆ తర్వాత వచ్చిన హండ్రెడ్ పర్సెంట్ లవ్ సినిమా తో దర్శకుడిగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు.

ఇక ఆ మధ్య విడుదలైన రంగస్థలం సినిమా రికార్డులను సృష్టించింది. తెలుగునాట సుకుమార్ పేరు ఒక రేంజ్ లో మారుమోగింది. ప్రస్తుతం సుకుమార్ టాలీవుడ్ అగ్ర స్టార్ డైరెక్టర్లలో తాను ఒకడిగా ఓ వెలుగు వెలుగుతున్నాడు. ఇదిలా ఉంటే సూపర్ స్టార్ మహేష్ బాబు, పరశురామ్ కాంబినేషన్ లో వస్తున్న సర్కారు వారి పాట మందరికి తెలిసిందే.

ఇక మహేష్ బాబు సరసన.. కీర్తి సురేష్ తన గ్లామర్ ను మరో రేంజ్ లో కనపరిచింది. ఈ సినిమా విడుదల దగ్గర పడడంతో తాజాగా ఈ సినిమా రిలీజ్ ఈవెంట్ ను జరుపుకున్నారు. కాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు దర్శకుడు సుకుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నాడు. ఇక అతడి చేతులమీద గానే మ.. మ మహేశా పాటను విడుదల చేశారు.

Sukumar: నేనొక్కడినే' రోజుల్లో మహేష్ బాబు అలా ఉండేవాడు.. సుకుమార్ కామెంట్స్ వైరల్!
Sukumar: నేనొక్కడినే’ రోజుల్లో మహేష్ బాబు అలా ఉండేవాడు.. సుకుమార్ కామెంట్స్ వైరల్!

Sukumar: సుకుమార్ మహేష్ బాబు గురించి ఈ విధంగా చెప్పుకొచ్చాడు!

ఈ క్రమంలో సుకుమార్ మాట్లాడుతూ.. మహేష్ బాబు ను ఇంతవరకు ఎప్పుడు.. ఇంత జోష్ ఫుల్ గా చూడలేదు అని చెప్పుకొచ్చాడు. మీతో పాటు సినిమా చూడ్డానికి నేను ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను అని తెలిపాడు. ఇక సెట్స్ లో డైరెక్టర్స్ అందరికీ మహేష్ బాబు చాలా రెస్పెక్ట్ ఇచ్చేవాడు. అంతేకాకుండా నేనొక్కడినే సినిమా రోజులు నేనెప్పటికీ మర్చిపోలేను.

ఆ సినిమాకు మీరు ఎంత ఆదరించారు.. ఇప్పుడు అలానే ఆదరిస్తున్నారు అని అన్నాడు. ఇక సర్కారీ వారి పాట చాలా సూపర్ హిట్ అవుతుంది. అంటూ సుకుమార్ పలు ఆసక్తికరమైన విషయాలు తెలిపాడు.

- Advertisement -