Suma: సుమ కనకాల పరిచయం అవసరం లేని పేరు సినీ ఇండస్ట్రీలో యాంకర్ గా కొనసాగుతూ ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి సుమ ప్రస్తుతం ఏమాత్రం తీరిక లేకుండా వరుస సినిమా ఈవెంట్లో బుల్లితెర కార్యక్రమాలు అంటూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. సుమ కేరళ అమ్మాయి అయినప్పటికీ తెలుగు చాలా స్పష్టంగా మాట్లాడుతూ తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. ఓ ఇంటర్వ్యూ సందర్భంగా సుమ ప్రేమ పెళ్లి గురించి పలు విషయాలు తెలిపారు.
ఈ సందర్భంగా సుమ మాట్లాడుతూ రాజీవ్ కనకాలను తాను ఇష్టపడుతూ ఉండే దానిని అయితే ఆయన కూడా నన్ను ఇష్టపడేవారు ఇక చివరికి తానే మొదట నాకు ప్రపోజ్ చేశారని సుమ తెలిపారు. ఇలా ప్రపోజ్ చేసిన తర్వాత ఇద్దరం కూడా ఒకరినొకరు ఇష్టపడకున్నామని అయితే పెళ్లి సమయానికి ఈ విషయం మా ఇంట్లో వారికి చెప్పడంతో మా ఇంట్లో ఈ పెళ్లికి అడ్డు చెప్పారని సుమా తెలిపారు. రాజీవ్ ఫ్యామిలీ నుంచి ఎలాంటి సమస్య రాలేదు. కానీ మా ఫ్యామిలీకి పెళ్లికి ఒప్పుకోలేదని తెలిపారు.
గొడవలు జరిగాయి…
ఇలా తనని పెళ్లి చేసుకుంటానని నేను పట్టు పట్టడంతో తన తల్లిదండ్రులు తన పట్ల కోప్పడ్డారని దీంతో దాదాపు వారం రోజులపాటు ఒక గదిలో బంధించి గదికి తాళం వేశారు అంటూ ఈ సందర్భంగా సుమ వెల్లడించారు అయితే చివరికి తన ప్రేమను గుర్తించినటువంటి తల్లిదండ్రులు చివరికి ఆయనతోనే నాకు పెళ్లి చేశారని ఈ సందర్భంగా ఆమె ప్రేమ పెళ్లి గురించి పలు విషయాలు తెలియజేశారు. పెళ్లి తర్వాత మా ఇద్దరి మధ్య గొడవలు వచ్చాయి విడాకులు తీసుకోబోతున్నాం అంటూ కూడా వార్తలు వచ్చాయి. అయితే పెళ్లయిన తర్వాత ప్రతి ఒక్క భార్యాభర్త గొడవ పడటం సర్వసాధారణమే అలాంటి గొడవ ఉన్నాయని అంతకుమించి ఎలాంటి గొడవలు లేవని సుమా క్లారిటీ ఇచ్చారు.