Sarkaru vari pata : సర్కారు వారి పాట.. సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్‌లో తెరకెక్కుతున్న 27వ సినిమా. జీఎంబీ ఎంటర్‌టైన్మెంట్స్, 14 రీల్స్ ప్లస్, మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఇప్పటికే దుబాయ్ లో ఫస్ట్ షెడ్యూల్ నెల రోజులు కంప్లీట్ చేసిన చిత్ర బృందం హైదరాబాద్‌లో ఉగాది రోజున సెకండ్ షెడ్యూల్ మొదలు పెట్టారు. ఆ షెడ్యూల్‌కి బ్రేక్ పడింది. పరశురాం దర్శకత్వం వహిస్తుండగా కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఎస్ ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే థమన్ ఈ సినిమాలోని మూడు పాటలను పూర్తి చేశాడు.

surprise-is-ready-from-sarkaru-vari-pata
surprise-is-ready-from-sarkaru-vari-pata

అయితే ఈ సినిమా నుంచి సూపర్ స్టార్ కృష్ణ బర్త్ డే సందర్భంగా మే 31న సర్కారు వారి పాట సినిమా నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేశారు. అయితే ప్రస్తుతం సర్కారు వారి పాట షూటింగ్‌కి బ్రేక్ పడటంతో దర్శకుడు టీజర్ రెడీ చేస్తున్నాడట. ఇప్పటికే దుబాయ్‌లో కంప్లీట్ అయిన షెడ్యూల్ నుంచి ఈ టీజర్ రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. అంటే జస్ట్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేయాలనుకున్న చిత్ర బృందం భారీ సర్‌ప్రైజ్‌కే ప్లాన్ చేస్తుండటం విశేషం.

Sarkaru vari pata : సర్కారు వారి పాట సర్‌ప్రైజ్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

కాగా ఈ టీజర్ 50 సెకన్ల పాటు కట్ చేస్తున్నట్టు సమాచారం. ఈ టీజర్‌లో యాక్షన్‌తో పాటు హీరోయిన్ కీర్తి సురేష్ – మహేష్‌ల మధ్య ఉండే లవ్ ట్రాక్‌కి సంబంధించిన సీన్స్ కూడా రివీల్ చేయనున్నట్టు తెలుస్తోంది. ఇక ఈ టీజర్‌కి థమన్ అదిరిపోయో బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అందివ్వనున్నట్టు తెలుస్తోంది. ఇక మహేష్ అభిమానులే కాదు .. సినీ లవర్స్ కూడా సర్కారు వారి పాట సర్‌ప్రైజ్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కాగా ఇదే రోజు మహేష్ కొత్త ప్రాజెక్ట్‌కి సంబంధించిన అనౌన్స్‌మెంట్ కూడా రాబోతోందట.

Stay on top of the game with the latest updates on Telugu latest news today! Experience the thrill of LIVE Telugu news updates like never before, only on Teluguonlinenews.com.

Mail

Published on ఏప్రిల్ 25, 2021 at 8:15 సా.