Tamannah: టాలీవుడ్‌లో ఎంతమంది కొత్త హీరోయిన్స్ వచ్చి వెళుతున్నా తమన్నా మాత్రం మిల్కీ బ్యూటీగా ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇప్పటికీ తనకు దక్కాల్సిన పాత్రలను దక్కించుకుంటోంది. కొందరు దర్శక, నిర్మాతలకు తమన్నా ఫస్ట్ ఛాయిస్‌గా ఉంటోంది. ఇంకా చెప్పాలంటే దర్శక, నిర్మాతలకే కాదు హీరోలకు కూడా తమన్నా ది బెస్ట్ అని తమ సినిమాలకు రిఫర్ చేస్తున్నారు. ఇటీవల కాలంలో తమన్నాకు సరైన హిట్స్ దక్కలేదు. పైగా షూటింగ్ మొదలై ఆగిపోయిన సినిమాలూ ఉన్నాయి.
అయినా కూడా మిల్కీకి హీరోయిన్‌గా అవకాశాలు వెతుక్కుంటూ వస్తున్నాయి. ప్రస్తుతం ఆమె మెగాస్టార్ చిరంజీవి సరసన భోళా శంకర్ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే, అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన మల్టీస్టారర్ ఎఫ్ 3తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాలో వెంకీ సరసన నటించింది తమన్నా. ఎఫ్ 2 ఎంత భారీ సక్సెస్ అయిందో అందరికీ తెలిసిందే. దాని సీక్వెల్‌గా వస్తుంది కాబట్టి అంచనాలు కూడా ఎఫ్ 3 సినిమాపై భారీగానే ఉన్నాయి. ఇలా చేతిలో రెండు పెద్ద ప్రాజెక్ట్స్ ఉండటంతో బిజీగానే ఉంది.

Tamannah: హీరోయిన్‌గా కొనసాగడం అంటే చాలా కష్టమే..
అయితే, తాజాగా ఎఫ్ 3 సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ మొదలైయ్యాయి. దీనిలో భాగంగా హీరోయిన్ తమన్నా ఇంటర్వ్యూ ఇచ్చింది. ఇందులో ఆమె.. నేను హీరోయిన్‌గా ఇండస్ట్రీలో అడుగుపెట్టి చాలా ఏళ్ళైపోయింది. సీనియారిటీ కూడా పెరిగింది. ఇప్పుడు దాన్ని కాపాడుకోవడం కోసమే ట్రై చేస్తున్నాను. అందుకే, ఎంచుకునే పాత్రల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నా. ఏంటి తమన్నా ఇలాంటి పాత్ర చేసిందని ఎవరూ అనుకోకూడదు.. అని చెప్పుకొచ్చింది. నేను ఎంచుకునే సినిమాలే నా స్థాయిని కాపాడతాయని తెలిపింది. నిజమే, దాదాపు 15 ఏళ్ళు దాటినా తమన్నాకు క్రేజ్ తగ్గలేదనే చెప్పాలి. నిజంగానే ఇంత లాంగ్ టైమ్ హీరోయిన్‌గా కొనసాగడం అంటే చాలా కష్టమే అని చెప్పాలి.