TDP, YCP: రాజకీయ నాయకులంతా అవకాశవాదులు ఎక్కడా ఉండరు. ముఖ్యంగా టీడీపీ-వైసీపీ పార్టీలు మాత్రం రాజకీయం కోసం దేన్నైనా వాడుకోవడానికి సిద్ధంగా ఉంటారు. ఎందుకంటే వాళ్లకు కావాల్సింది అధికారం, ఓట్లు దాని కోసం దేన్నీ ఎటైనా తిప్పుతారు, దేన్నైనా రాజకీయం చేస్తారు. ఇప్పుడు ఏపీలో ఉన్న టీడీపీ నాయకులు, వైసీపీ నాయకులు ఇప్పుడు దళిత్ వాదాన్ని వాడుకుంటూ రాజకియం చెయ్యడానికి సిద్ధమయ్యారు. ఇవ్వాళ అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యే అయిన బలవీరాంజనేయ స్వామి, వైసీపీ ఎమ్మెల్యే అయిన సుధాకర్ ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. అసెంబ్లీలో గొడవపడటమే తప్పంటే ఇప్పుడు ఈ గొడవను అడ్డుపెట్టుకొని రెండు రాజకీయం చెయ్యడానికి సిద్ధమయ్యారు.
సిగ్గుందా ఈ నాయకులకు!!
ఈనాయకులకు దళితుల మీద దాడులు జరిగినప్పుడు దళిత వాదం గురించి మాట్లాడారు, దళితులను ఇష్టమొచ్చినట్టు హింసిస్తుంటే దళితుల గురించి మాట్లాడరు, కానీ ఇప్పుడు రాజకియం చెయ్యడానికి మాత్రం దళిత ఎమ్మెల్యేను కొట్టారని, బ్లాక్ డే మీడియా ముందు చెప్తున్నారు. ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ కానీ అధికారంలో ఉన్న వైసీపీ కానీ దళితుల గురించి, వాళ్లపై జరుగుతున్న దాడుల గురించి చేసినదేమన్నా ఉందా అంటే ఏమి లేదు కానీ ఇప్పుడు రాజకీయం చెయ్యడానికి మాత్రం దళితులనువాడుకుంటున్నారు. అయిన దళిత ఎమ్మెల్యేలు అయిన వాళ్ళకైనా బుద్ధి ఉండాలి కదా ఇలా పార్టీలు ఏమి చెప్తే అది, పార్టీల కోసం దళితులను వాడుకుంటున్నా కూడా ఇలా చూస్తూ ఎలా ఉన్నారో ఎవ్వరికి అర్థం కాదు.
ఈ కుల రాజకీయాలేంది
ఇలా చీప్ గా క్యాస్ట్ పాలిటిక్స్ చేసే నాయకులు ఇప్పుడులో ఎక్కువైయ్యారు. మొన్న మచిలీపట్నంలో పవన్ కళ్యాణ్ డైరెక్ట్ గా కాపు వాళ్ళు తనకే మద్దతు ఇవ్వాలని అడుగుతున్నాడు. అలాగే టీడీపీ , వైసీపీ నాయకులు మాత్రం ఎప్పటి నుండో ఈ కులపిచ్చి రాజకీయాల్లోకి చేస్తూనే అధికారంలోకి వస్తున్నారు. ఇప్పుడు మళ్ళీదళితుల ఓట్ల కోసం ఈ దళితవాదాన్ని ఎత్తుకున్నారు. అయినా కులపిచ్చి నాయాళ్లను నాయకులుగా ఎన్నుకున్న వాళ్లకు బుద్ధి లేనప్పుడు ఇలాంటి నాయకులే వస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ దళిత రాజకీయాలు రాష్ట్రంలో ఇంకెంత కాలం నడుస్తాయో చూడాలి.