Telangana: రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు పరీక్షల హడావిడీ నడుస్తుంది. తెలంగాణాలో ఇప్పుడు ఒక పక్క కంపిటీటివ్ పరీక్షలు నడుస్తున్నాయి అలాగే మరో పక్క ఇంటర్ ఎగ్జామ్స్ , ఓపెన్ డిగ్రీ ఎగ్జామ్స్ , డిగ్రీ పరీక్షలను నడుస్తున్నాయి. అయితే ఇప్పుడు పదో తరగతి పరీక్షలకు సంబంధించిన ప్రకటలను కూడా ప్రభుత్వం విడుదల చేస్తుంది. ఈనెల 24నుండి పదో తరగతి విద్యార్థులకు సంబంధించిన హాల్ టికెట్స్ ను ప్రభుత్వ వెబ్సైటులో పెట్టనున్నట్టు అధికారులు వెల్లడించారు. వచ్చే నెల 3వ తేదీ నుండి జరగనున్న ఈ పరీక్షలకు రాష్ట్రంలో మొత్తంగా4,94,616 మంది స్టూడెంట్స్ కోసం 2652 కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు అధికారులు వెల్లడించారు. అయితే ఈసారి జరిగే పదవ తరగతి పరీక్షల్లో కీలక మార్పులు తెచ్చినట్టు అధికారులు ఎప్పటి నుండో చెప్తున్నారు.
10వ తరగతి పరీక్షల్లో వచ్చిన మార్పులివే
ఈసారి జరిగే పదవ తరగతి పరీక్షలు సీసీ కెమెరా నిఘాలో జగనున్నాయి. లాస్ట్ ఇయర్ వరకు లేని విధానాన్ని ఈసారి ప్రవేశపెడుతున్నట్టు సమాచారం. అలాగే లాస్ట్ ఇయర్ వరకు ప్రతి సబ్జెక్టు కు రెండు రోజులు పరీక్షా నిర్వహించేవారు కానీ ఈసంవత్సరం నుండి ఒక సబ్జెక్టును ఒక్కరోజు మాత్రమే నిర్వహించనున్నారు. అయితే పరీక్షా సమయం ప్రతి సబ్జెక్టు కు 3 గంటలుగా నిర్ణయించారు. వచ్చే నెల నుండి పరీక్షా ఉదయం 9:30 నుండి 12:30 వరకు జరగనుంది. అయితే సైన్స్ పరీక్షకు మాత్రం 3:20 నిమిషాల సమయం ఇస్తున్నట్టు అధికారులు వెల్లడించారు.
ఆ తప్పులు మళ్ళీ రిపీట్ అవుతాయా!!
ప్రతి సంవత్సరం పదవ తరగతి కానీ ఇంటర్ కానీ ఫలితాలువ్ వచ్చినప్పుడు ఎదో ఒక విధంగా ప్రభుత్వం తరపున తప్పులు జరుగుతూనే ఉన్నాయ్. ఆతప్పుల వల్ల స్టూడెంట్స్ చనిపోవడం కూడా జరుగుతుంది. కాబట్టి ఈసారి ఫలితాల విషయంలో ఎలాంటి తప్పులు జరగకుండా ఉండటానికి ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారో మాత్రం అధికారులు వెల్లడించలేదు. అధికారులు నిర్లక్ష్యం వల్ల చిన్న వయసులోనే స్టూడెంట్స్ చనిపోతున్నారు. అలాగే గత సంవత్సరం వరకు కరోనా వల్ల అందరిని పాస్ చేశారు. కానీ ఈసారి పాస్ పర్సెంటేజ్ ఎంత వస్తుందో చూడాలి.