Telangana: వచ్చే నెల 3 నుండి తెలంగాణాలో పదవ తరగతి పరీక్షలు జరుగుతుండటంతో ప్రభుత్వం నేడు హాల్ టికెట్స్ విడుదల చేసింది. పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్- bse.telangana.gov.inలో హాల్ టిక్కెట్‌లను డౌన్ లోడ్ చేసుకోవచ్చు. పైన ఉన్న లింక్ ను క్లిక్ చేసి, హాల్ టికెట్స్ ను డౌన్ లోడ్ చేసుకోవచ్చు.
TS SSC పరీక్ష టైమ్‌టేబుల్ ప్రకారం, పరీక్షలు ఏప్రిల్ 3 నుండి ఏప్రిల్ 13 వరకు వేర్వేరుగా నిర్వహించబడతాయి. పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు తమ TS SSC హాల్ టిక్కెట్‌ను పరీక్షా కేంద్రానికి తీసుకెళ్లాలి. BSE తెలంగాణ రెగ్యులర్, ప్రైవేట్, OSSC మరియు వొకేషనల్ పరీక్షలకు అడ్మిట్ కార్డ్‌ను జారీ చేసింది. తెలంగాణ బోర్డు పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు తమ రోల్ నంబర్ మరియు ఇతర అడిగిన ఆధారాలను ఉపయోగించి అడ్మిట్ కార్డ్‌ని తనిఖీ చేసి డౌన్‌లోడ్ చేసుకోగలరు. మీ TS SSC హాల్ టికెట్ 2023ని డౌన్‌లోడ్ చేసుకోవడానికి కింద చెప్పిన ప్రాసెస్ ను ఫాలో అవ్వండి
TS SSC హాల్ టికెట్ 2023: డౌన్‌లోడ్ చేయడం ఎలా
1. అధికారిక వెబ్‌సైట్–bse.telangana.gov.inకి వెళ్లండి
2. కనిపించిన హోమ్‌పేజీలో, “SSC పబ్లిక్ పరీక్షలు ఏప్రిల్ 2023 – హాల్ టిక్కెట్‌లు” అని ఉన్న లింక్‌పై క్లిక్ చేయండి.
3. కొత్త లాగిన్ పేజీ ఓపెన్ అయితది.
4. అక్కడ అడిగిన డీటెయిల్స్ ఫిల్ చెయ్యండి.
5. అక్కడ వచ్చిన హాల్ టికెట్ ను చెక్ చేసి, డౌన్‌లోడ్ చేయండి
6. అన్ని కరెక్ట్ గా ఉంటె దాని ప్రింట్ తీసుకోండి
తెలంగాణ 10వ తరగతి అడ్మిట్ కార్డును డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత, అభ్యర్థులు రిపోర్టింగ్ సమయం మరియు ఇతర ముఖ్యమైన వివరాలను చెక్ చేసుకోవాలి. తెలంగాణ TS SSC పరీక్ష ఒకే షిఫ్టులో నిర్వహించబడుతుంది- ఉదయం 9.30 నుండి మధ్యాహ్నం 12.30 వరకు ఉంటుంది కాబట్టి ఒక 30 నిముషాలు ముందుగానే సెంటర్ వెళ్తే మంచిగుంటది.