Telangana: తెలంగాణాలో ఈ మధ్యకాలంలో చాలా గుడ్ న్యూస్ కేసీఆర్ చెప్తూనే ఉన్నారు. మొన్నటి వరకు నిరుద్యోగులకు ఒక నోటిఫికెషన్స్ తరువాత ఇంకోటి ఇస్తూ వాళ్లకు గుడ్ న్యూస్ చెప్పారు. ఇప్పుడు ఆల్రెడీ ఉపాద్యాయులుగా పని చేస్తున్న వాళ్లకు కేసీఆర్ గుడ్ న్యూస్ చెప్పారు. ఆల్రెడీ ఉపాధ్యాయులుగా ఉన్నవారికి ప్రమోషన్స్ ఇవ్వడానికి, అలాగే బదిలీలు చెయ్యడానికి నిర్ణయం తీసుకున్నట్టు ప్రభుత్వం వెల్లడించింది. నిన్న సబితా ఇంద్రారెడ్డితో సమావేశమైన ఉపాధ్యాయ సంఘాలకు ఈ గుడ్ న్యూస్ ను అధికారులు వెల్లడించారు. త్వరలోనే దీనికి సంబంధించిన ఉత్తరువులు జారీ కానున్నాయని తెలిపారు. కౌన్సలింగ్ ద్వారా ఈ బదిలీల ప్రక్రియ పూర్తి పారదర్శకంగా జరుగుతుందని అధికారులు వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 9266 మంది ఉపాధ్యాయులు పదోన్నతులు పొందనున్నారు.
ష్కేడ్యులు ఎప్పుడొస్తాయ్!!
నిన్న మంత్రి హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డిలు ఉపాధ్యాయ సంఘాలతో సమావేశమై ఈనిర్ణయం తీసుకున్నారు. ఫిబ్రవరి 10 నాటికి పదోన్నతులు, బదిలీల ప్రక్రియ పూర్తయ్యేలా షెడ్యూల్ విడుదల చేయనున్నారు. అయితే, విద్యా సంవత్సరం ముగిసిన తర్వాతే రిలీవ్ అయ్యేలా ఉత్తర్వులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఎస్జీటీగా ఉన్నవాళ్లకు స్కూల్ అసిస్టెంట్ గా, స్కూల్ అస్సిస్టెంగ్ గా ఉన్నవారికి ప్రధానోపాధ్యులుగా ప్రమోషన్స్ రానున్నాయి. ఎప్పటి నుండో ప్రమోషన్స్, ట్రాన్స్ఫర్స్ కోసం ఎదురు చూస్తున్న వాళ్లకు ఇదొక గుడ్ న్యూస్.
డీఎస్సీ నోటిఫికేషన్ ఎప్పుడొస్తాదో!!
టెట్ ఎక్సమ్ ను ప్రభుత్వం కండక్ట్ చేసి, ఇప్పటికే చాల నెలలు అవుతుంది. అందులో క్వాలిఫై ఐన అభ్యర్థులు డీఎస్సి కోసం వైట్ చేస్తున్నారు. 2019 నుండి డీఎస్సీ నోటిఫికేషన్ వస్తుందని ప్రభుత్వం చెప్తూనే ఉంది. కానీ ఇప్పటి వరకు రాలేదు. మొన్న టెట్ రిజల్ట్స్ వచ్చిన వెంటనే డీఎస్సీ కూడా ఉంటుందని అంతా ఆశించారు కానీ ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వెయ్యడం లేదు. ఎన్నో నోటిఫికెషన్స్ ప్రభుత్వం ఇస్తూనే ఉంది కానీ డీఎస్సీ గురించి మాత్రం పట్టించుకోవడం లేదు. ఇంకా గురుకుల నోటిఫికేషన్ కూడా ఇవ్వాల్సి ఉంది. ఈ నోటిఫికేషన్ సంక్రాతి తరువాత వస్తుందని అంతా అనుకుంటున్నారు కానీ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి. ఇప్పటికే ప్రభుత్వం ఎన్నో నోటిఫికెషన్స్ ఇస్తూ యువతకు ఉత్సహాన్ని ఇస్తూనే ఉంది, ఈ ఒక్క నోటిఫికేషన్ కూడా ఇస్తే టెట్ క్వాలిఫై అయినా వాళ్ళు కుష్ ఐతారు.