Telangana: కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తరువాత యువతను పట్టించుకోవడం లేదని, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను పక్కన పెట్టి, ఇప్పుడు ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదని విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ప్రభుత్వం నెలకో ఉద్యోగ నోటిఫికేషన్ ఇస్తూ నిరుద్యోగ యువతకు సంతోషాన్ని ఇస్తున్నారు. ఎన్నికలకు దగ్గరికి వస్తున్నాయి కాబట్టే యువత ఓటు కోసమే ఇప్పుడు ఇలా నోటిఫికెషన్స్ ఇస్తున్నారని, ప్రతిపక్షాల నాయకులు విమర్శలు గుప్పిస్తున్నారు. ఇప్పుడు మళ్ళీ గ్రూప్ 2 నోటిఫికేషన్ ఇచ్చి ఆ ఆనందాన్ని ఇంకా రెట్టింపు చేసింది. గ్రూప్ 2 నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్న వారికి ఇదొక శుభవార్త. ఈరోజు నుండి గ్రూప్ 4 ఉద్యోగాలకు ప్రారంభమవుతుంది. ఈ దరఖాస్తు 23న ప్రారంభం కావాల్సింది కానీ అప్పుడు కొన్ని కారాణాల వల్ల స్టార్ట్ కాలేదు. ఈరోజు నుండి గ్రూప్ 4 పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.

పోస్టులు వివరాలు:
పోస్టుల వివరాలు:
సాంకేతిక విద్యలో ఫిజికల్ డైరెక్టర్ : 37
ఇంటర్మీడియట్ విద్యలో ఫిజికల్ డైరెక్టర్ : 91
మొత్తం : 128
అగ్రికల్చర్ ఆఫీసర్ పోస్టులు మల్టీజోన్ -1 : 100
మల్టీజోన్ -2 : 48
మొత్తం : 148.
అర్హతలు:
ఫిజికల్ డైరెక్టర్ పోస్టులకు పోటీ పడే అభ్యర్థుల వయస్సు 01-07-2022 నాటికి 18-44 ఏళ్ల మధ్య ఉండాలి. ఈ పోస్టులకు దరఖాస్తులను జనవరి 6, 2023 నుంచి జనవరి 27 సాయంత్రం 5 గంటల వరకు స్వీకరిస్తారు. అగ్రికల్చర్ ఆఫీసర్ పోస్టులకు ఆన్‌లైన్‌లో జనవరి 10 నుంచి జనవరి 30, 2023, సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పోస్టుల కోసం యువత కష్టపడి చదువుకోవాలని, వచ్చిన అవకాశాన్ని యువత సద్వినియోగం చేసుకోవాలని అధికారులు వెల్లడించారు. మరిన్ని వివరాల కోసం www.tspsc.gov.in వెబ్‌సైట్‌ను చూడాలని టీఎస్‌పీఎస్సీ కార్యదర్శి అనితారామచంద్రన్ సూచించారు.